కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్

శ్రీ~:
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమద్ వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

komandur-ilayavilli-achan

కొమాణ్డుర్ ఇళయవిల్లి ఆచ్చాన్ – శెంపొసెన్ కోయిల్, తిరునాంగూర్

తిరునక్షత్రము : చైత్ర మాసము చిత్రై, ఆయిల్యమ్

అవతార స్థలము : కొమాణ్డూర్

ఆచార్యులు : ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము : తిరుప్పేరూర్

కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ ఎమ్పెరుమానార్ లకు ఎంబార్ వలె బందువులు. వీరిని బాలదన్వి గురు అని కూడా వ్యవహరించేవారు. ఇళయవిల్లి / బాలదన్వి అనగా అర్థము లక్ష్మణుడు – ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) శ్రీరాముడికి సేవలు చేసిన మాదిరిగా వీరు ఎమ్పెరుమానార్ లకు సేవలు చేసెను. ఎమ్పెరుమానార్ స్వయముగా ఏర్పరచిన 74 సింహాసనాదిపతులలో (ఆచార్యులు) వీరు ఒకరు.

వీరి తనియన్ మరియు వాళి తిరునామములో చెప్పిన విదముగా వీరికి పెరియ తిరుమలై నంబి (శ్రీ శైల పూర్ణులు) గారికి చాలా గొప్ప సంభందము కలదు మరియు అలానే వీరు నంబి గారికి కైంకర్యము కూడా చేసిరి.

చరమ ఉపాయ నిర్ణయము ((http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html) లో, నాయనారాచ్చాన్ పిళ్ళై, కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ గొప్పతనమును వర్ణించిరి. మనము ఇప్పుడు ఇక్కడ దానిని  చూద్దాము.

ఉడయవర్ పరమపదమునకు చేరినప్పుడు, చాలామంది వారిని అనుసరించిరి (వారి యొక్క ప్రాణములను వదిలిరి). కణియనూర్ సిరియాచ్చాన్ ఉడయవర్లను వదిలి కొంత కాలము కణియనూర్లో నివసించి తదుపరి కొంతకాలమునకు తమ ఆచార్యులను (ఉడయవర్) ప్రేమతో సేవించుటకు కోయిల్ (శ్రీరంగము) నకు బయలుదేరిరి. దారిలో, వారు ఒక శ్రీవైష్ణవుడిని కలిసి ఈ విదముగా అడిగెను “మా ఆచార్యులైన ఎమ్పెరుమానార్ ఆరోగ్యముగా ఉన్నారా?” అప్పుడు ఆ శ్రీవైష్ణవుడు ఉడయవరులు పరమపదము చేరిన విశయమును చెప్పెను. ఆ వార్తను విని, వెంటనే, కణియనూర్ శిరియాచ్చాన్ “ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణము” అని చెప్పి వారు కూడా పరమపదించిరి. కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ తిరుప్పేరూర్లో నివసించేవారు. ఒక రాత్రి, తన కలలో ఆకాశములో ఉడయవరులను దివ్య రథములో కూర్చొని ఉన్నట్టుగా చూసిరి. అలానే పరమపదనాతన్ వేలమంది నిత్య సూరులు ఆళ్వార్, నాధమునులు మరియు ఇతర ఆచార్యులు, ఇతర అనేకులు మంగళా వాయిద్యములతో  ఎమ్పెరుమానారులను పరమపదమునకు తీసుకువెళ్ళుతున్నట్టుగా చూసిరి. ఆ స్వాగతమును చూసి ఎమ్పెరుమానార్ రథము పరమపదమునకు వెళ్ళుచుండగా అందరూ వారిని అనుసరించిరి. వారు వెంటనే మేల్కొని ఏమి జరిగినో తెలుసుకొనగోరి వారి యొక్క పక్కన నివసించే వారితో ఈ విధముగా చెప్పిరి “వళ్ళల్ మణివణ్ణన్”  “మన ఆచార్యులైన ఎమ్పెరుమానార్ దివ్య రథముపై ఎక్కి పరమపదమునకు పరమపదనాధులతో మరియు నిత్యసూరులతో కూడి వెళ్ళుచున్నారు. నేను ఇక్కడ ఒక క్షణమైనా ఉండలేను. ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్” అని వెంటనే వారి ప్రాణమును వదిలి పరమపదమునకు చేరిరి. ఎమ్పెరుమానార్ పరమపదమునకు చేరిన వార్తను విని ఎందరో శిష్యులు ఇలా వారి ప్రాణములను వదిలిరి. ఎవరైతే ఎమ్పెరుమానార్లతో నివసించి ఉన్నారో వారు మాత్రమే ఎమ్పెరుమానార్ ఆఙ్ఞతో ఇష్టము లేకపోయిననూ సాంప్రదాయ పరిరక్షణకై జీవించి ఉండిరి. వారిని విడచి ఉండలేక వారి శిష్యులు కూడా ప్రాణములను వదలడము ఎమ్పెరుమానార్ల గొప్పతనము.

కొమాణ్డూర్ ఇళయ విల్లి ఆచ్చాన్ జీవితములోని కొన్ని గొప్ప సంఘటనలను చూశాము. వీరు పూర్తి భాగవత నిష్టను కలిగి ఉండి ఎమ్పెరుమానార్  లకు చాలా ప్రియ శిష్యులైరి. వారి వలె మనకూ భాగవత నిష్టయందు కొంతైనా అనుగ్రహము కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము .

కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ తనియన్ ~:

శ్రీ కౌశికాన్వయ మహాంభుతి పూర్ణచంద్రమ్
శ్రీ భాష్యకార జననీ సహజా తనుజమ్
శ్రీశైలపూర్ణ పద పంకజ సక్త చిత్తమ్
శ్రీబాలదన్వి గురువర్యమ్ అహమ్ భజామి

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.koyil.org/2013/04/03/koil-komandur-ilayavilli-achan/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

1 thought on “కోయిల్ కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్”

Leave a Comment