శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:
తిరునక్షత్రము: మాఘ మాసము, ఆశ్లేషా
అవతార స్థలము: ఉఱైయూర్
ఆచార్యులు: ఎమ్పెరుమానార్
పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగము
పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ మరియు వారి దర్మపత్ని పొన్నాచ్చియార్ ఉఱైయూర్ లో నివసించేవారు. దాసర్ ఆ దేశము రాజుగారి కొలువులో గొప్ప మల్లయోదుడు. వారు తమ దర్మపత్ని సౌందర్యముయందు ఎంతో అనుభందమును కలిగి ఉండెడివారు (ముఖ్యముగా ఆమె నేత్రములందు). వారికి దనుర్దాసు అను నామముతో కూడా కలదు. వీరు బాగా దనవంతులు మరియు వారికి గల దైర్య సాహసములకు ఆ రాజ్యములో వీరిని అందరు గౌరవించేవారు.
ఒకసారి శ్రీ రామానుజులు వారి శిష్యులతో నడుస్తూ ఉండగా, దాసర్ ఒక చేతితో గొడుగును పొన్నాచికి ఎండను తగులకునండగా మరొక చేతో ఆమె యొక్క పాదములకు ఇబ్బంది కలుగకుండా భూమిపై వస్త్రమును పరచుకుంటూ వెళ్ళడమును గమనించిరి. ఎమ్పెరుమానార్ దాసర్ కి ఆ స్త్రీ యందు గల అనుబందమును చూసి ఆశ్చర్యచకితులై వారిని రమ్మని పిలిచెను దాసర్ ని ఆ స్త్రీకి ఎందుకు అలా సేవ చేస్తున్నావని అడిగిరి, అందుకు దాసర్ ఈ విదముగా చెప్పెను ఆమె నేత్రములు చాలా అందముగా ఉండడము వలన ఆమెకు దాసుడను అయ్యెనని చెప్పిరి, ఆ ఆందమును కాపాడుట కొరకు ఏమైనా చేయుదని అని చెప్పెను. ఎమ్పెరుమానార్ వెంటనే తమ చాతుర్యముతో దాసర్ని ఈ విదముగా అడిగెను, నేను నీ భార్య యొక్క నేత్రముల కన్నా అందమైనది వేరొకటి చూపిస్తే దానికి దాసుడవు అవుతవా అని అడిగెను. ఎమ్పెరుమానార్ అతడిని శ్రీ రంగనాధుని వద్దకి తీసుకెళ్ళి ఎమ్పెరుమాన్ ని వారి యొక్క నేత్ర సౌందర్యమును దాసర్ కి తిరుప్పాణాళ్వారులకు అనుగ్రహించిన విదముగా చూపించమనిరి. ఎమ్పెరుమాన్ సజముగానే అందమైన నేత్రములను కలిగిఉండడముచే వెంటనే దాసర్ సహజ సిద్దమైన అందము ఇదే అని తెలుసుకొని ఎమ్పెరుమానార్లకు దాసులై అతడిని శిష్యునిగా స్వీకరించమని అభ్యర్తించెను.అతని దర్మపత్ని కూడా ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానార్ల గొప్పతనమును తెలుసుకొని వెంటనే ఎమ్పెరుమానార్లని ఆశ్రయించిరి. ఆ దంపతులు అన్ని బందములను వదిలి శ్రీరంగమునకు వచ్చి ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమాన్ల సేవ చెస్తూ అక్కడే నివసించిరి. ఎమ్పెరుమాన్ దాసర్ని పూర్తిగా అనుగ్రహించిరి మరియు ఎల్లప్పుడూ ఎమ్పెరుమాన్ ని వనవాసమునందు లక్ష్మణుడు ఏ విదముగా నిద్ర లేకుండా శ్రీ రామునికి సేవ చేసెనో ఆ విదముగా చేయుటచే వారికి పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ అను నామము వచ్చెను.
దాసర్ మరియు పొన్నాచ్చియార్ లు పూర్తి జీవితమును పూర్తిగా ఎమ్పెరుమానార్ మరియు ఎమ్పెరుమానార్ల కైంకర్యములకు ఉపయోగించిరి. ఒకసారి నంపెరుమాళ్ళ తీర్తవారి (ఉత్సవము చివరి రోజు), ఎమ్పెరుమానార్ గుడి పుష్కరిణి లో నుండి పైకి వస్తూ, దాసర్ యొక్క చేతిని పట్టుకొనిరి. కొందరు శిష్యులు ఎమ్పెరుమానార్ సన్యాసి అయి ఉండి దాసర్ చేతిని పట్టుకోవడుమును (కారణము అతడి వర్ణము) తప్పుగా బావించిరి. వారు తమ భావమును ఎమ్పెరుమానార్ కు చెప్పగా అప్పుడు ఎమ్పెరుమానార్ దాసర్ మరియు పొన్నాచ్చియారుల గొప్పతనమును ఒక అందమైన సంఘటన ద్వారా తెలుపెను.
ఎమ్పెరుమానార్ వారిని దాసర్ల ఇంటికి వెళ్ళి ఆ గృహమునందు గల ఆభరణములను ఎత్తుకురమ్మని చెప్పిరి. వారు దాసర్ ఇంటికి వెళ్ళగా అక్కడ పొన్నాచ్చియార్ పడుకొని ఉండెను. వారు నిశబ్ధముగా ఆమె వద్దకి చేరి ఆమె పై గల ఆభరణములను తీయుటకు ఉపక్రమించిరి. పొన్నాచ్చియార్ ఈ శ్రీ వైష్ణవులు వారికి గల బీదతనము వలన ఇలా చేస్తున్నారేమోననని భావించి ఆభరణములను సులభముగా తీయువిదముగా చెసినది. ఒక వైపు వారు పూర్తి చేయగానే ఇంకోప్రక్కన గల ఆభరణములను తీయుటకొరకై అటు తిరిగను. కాని వారు భయముతో అక్కడి నుండి పరిగెత్తి ఎమ్పెరుమానార్ వద్దకి చేరెను. ఆ సంఘటనలను విన్న తదుపరి, ఎమ్పెరుమానార్ వారిని మళ్ళీ దాసర్ యొక్క గృహమునకు వెళ్ళీ ఏమి జరుగుతుందో గమనించమనిరి. వారు అక్కడికి చేరగానే, అక్కడ దాసర్ తిరిగి వచ్చి పొన్నాచ్చియార్తో మాట్లడడమును గమనించిరి. అతను ఆమెను ఒక పైపుగల ఆభరణములు లేవెందులకు అని అడుగగా. ఆమె ఈ విదముగా చెప్పెను కొందరు శ్రీవైష్ణవులు వచ్చి దొంగిలించుచుండగా వారికి వీలుగా ఇంకో వైపునకు గల ఆభరణములను తీయుటనకు వీలుగా తాను తిరుగగా వారు వెళ్ళనని చెప్పెను. ఆ సమయమున, దాసర్ నీవు ఒక రాయి వలె ఉంటె వారికి తోచిన విదముగా తీసుపోయేవాళ్ళు, నీ చర్య వాలన వారు భయముతో వెళ్ళిరి అని విచారపడిరి. వారిద్దరు ఎంతో గొప్పవారగుటచే వారి యొక్క ఆభరణములను దొంగలించినా ఆ విదముగా ఆలోచించెను. ఆ శ్రీవైష్ణవులు తిరిగి ఎమ్పెరుమానార్ వద్దకి వచ్చి అక్కడ జరిగిన సంఘటనల్ను వివరించి ఆ దంపతుల గొప్పతనమును అంగీకరించెను. మరునాడు ఉదయము ఎమ్పెరుమానార్ దాసర్ నకు జరిగిన విషయమును చెప్పి ఆభరణములను తిరిగి ఇచ్చెను.
దాసర్ మహామతి (గొప్ప వివేకము కలిగిన వారు) గా కీర్తించబడెను. వారు ఎమ్పెరుమాన్లతో శ్రీ విదురులు మరియు పెరియాళ్వారుల వలె అనుభందమును కలిగిఉండిరి. పొన్నాచ్చియారుల నిర్వాహములు కూడా పూర్వాచార్య శ్రీ సూక్తుల యందు కొన్ని సంఘటనలు ద్వారా ఆమె శాస్త్రము నందు గొప్ప పరిజ్ఞానము కలిగినదిగా చెప్పబడెను .
చాలా ఐదిహ్యములు దాసర్ మరియు వారి ధర్మ పతి గొప్పతనములను మన పూర్వాచార్య శ్రీ సూక్తులందు కలవు. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము.
- 6000 పడి గురుపరంపరా ప్రభావము – ఒకసారి ఎమ్పెరుమానార్ విభీషణ శరణాగతి వివరించుచుండగా. దాసర్ గోష్టిలో నుండి నిలుచొని ఈ విదముగా అడిగిరి “శ్రీ రాముడు సుగ్రీవ, జాంబవంతులు, మొదలగు వారితో విభీషణుడిని స్వీకరించమని, అతడు సమస్తమూ వదిలినప్పడికి కూడా,మరి నాకు ఎలా (అతడు ఇంకనూ సంసారము మొదలగు వాటి యందు ఉండడమువలన) మోక్షము లబించును?”. ఎమ్పెరుమానార్ ఈ విదముగా సమాదానమును చెప్పిరి “ఒకవేళ నేను మోక్షమును పొందితే, నీకు కూడా లభించును; ఒక వేళ పెరియ నంబి మోక్షమును పొందితే, నాకూ లభించును; ఒక వేళ ఆళవందార్ మోక్షమును పొందితే, పెరియ నంబి లకు లభించును; ఆ విదముగా పూర్తి పరమ్పరకునూ లభించును; కారణము నమ్మాళ్వార్ తనకి మోక్షము లభించెనని దృవీకరించిరి మరియు పెరియ పిరాట్టియార్ ఎమ్పెరుమానుని అందరికీ మోక్షము ఇచ్చేలా కోరినది. ఎవరైతే భాగవత శేషత్వమును కలిగి ఉందురో వారు తప్పక అర్హులు – ఎలాగైతే 4 రాక్షసులు విభీషణుడితో కలిసి రావడముచే శ్రీ రాముడి ఆశ్రయమును పొందిరి కారణాము వారు విభీషణుడి ఆశ్రయించడముచే”.
- పెరియ తిరుమొళి 2.6.1 –పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – దాసర్ ఎమ్పెరుమాన్ యెడల పూర్తి మిక్కిలి అనుబందమును కలిగిఉండిరి (యశోద, పెరియాళ్వార్ మొదలగు వారి వలె) ఇక్కడ ఎలానో చూద్దాము. నమ్పెరుమాళ్ (శ్రీ రంగనాధుడు) పురప్పాడు (తిరువీధి) సమయమున, దాసర్ నంపెరుమాళ్ ఎదురుగా తన చేతియందు కత్తిని ఉంచుకొని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళేవారు. ఒకవేళ ఏ చిన్న ఇబ్బంది నంపెరుమాళ్ళకి కలిగినా, తన కత్తితో తానే స్వయముగా సంహరించుకొనుటకు వీలుగా (ఇక్కడ మనము గమనించవలసిన కారణము, చాలా శ్రద్దతో వారు నంపెరుమాళ్ళని తిసుకొని వెళ్ళేవారు, అప్పుడు తాను సంహరించుకొనే అవకాశము రాదు). ఈ విదమైన సంభదమును కలిగి ఉండడముచే, దాసర్ని మహామతి అని వ్యవహరించేవారు.
- తిరువిరుత్తమ్ 99 – నంపిళ్ళై వ్యాఖ్యానము – ఎప్పుడైనా కూరత్తాళ్వాన్ తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును చెప్పుచుండగా, దాసర్ భావోద్వేగముతో కృష్ణ చరితమును అనుభవించేవారు. ఆళ్వాన్ దాసర్ యొక్క అనుభవపూర్వక గొప్పతనమును గమనించీ ఈ విదముగా చెప్పేవారు. “మేము భగవత్ విషయమును నేర్చుకొని ఇతరులకు వివరించ గలము – మీరు ఆ భగవానుడి గురించే ఆలోచిస్తూ ఉండిపోతారు – మీ అలొచన విధానము చాలా గొప్పది”. ఆళ్వాన్ స్వయముగా ఎమ్పెరుమాన్ గురించి ఆలొచించేవారు – వారే స్వయముగా దాసర్ గురించి ఈ విదముగా అన్నారంటే మనము ఇక్కడ దాసర్ యొక్క గొప్పతనమును గ్రహించవలెను.
- తిరువిరుత్తమ్ 9 – నంపిళ్ళై స్వాపదేశము – ఒకసారి ఎమ్పెరుమానార్ శ్రీరంగమును వదిలి తిరుమలైకి వెళ్లదలిచిరి. ఆ సమయమున ఒక శ్రీవైష్ణవుడిని సామాను భద్రపరచు గదికి వెళ్ళి బియ్యమును తెమ్మని పంపిరి (ఆ గది దాసర్ ఆదినములో ఉండెను). ఆ వార్త తెలిసిన దాసర్ ఎమ్పెరుమానారుల సాంగత్య ఎడబాటును తలుచుకొని భాదతో గదిలోన దుఖిఃచ సాగిరి. ఈ ఘటన వారికి ఎమ్పెరుమానార్ యెడల గల గొప్ప అనుభందమును చుపును. ఆ శ్రీవైష్ణవుడు తిరిగి ఎమ్పెరుమానార్ వద్దకి వచ్చి జరిగిన దానిని చెప్పెను. ఎమ్పెరుమానార్ దాసర్ యొక్క పరిస్థితిని గమనించి వారు కూడా దాసర్ ఎడబాటును వీడి ఉండలేమని చెప్పిరి.
- తిరువాయ్మొళి 4.6.6 – నంపిళ్ళై వ్యాఖ్యానము – ఒకసారి దాసర్ ఇద్దరు మేనళ్ళుల్లు (పేర్లు వణ్డర్ మరియు చొణ్డర్) ఒక రాజుతో నడుస్తూ వెళ్తూ ఉండగా దారిలో ఆ రాజు వారికి ఒక జైన మందిరమును చూపి అది విష్ణుమందిరమని చెప్పి వారిని ప్రార్తించమనిరి. నిర్మాణము లందు పోలిక ఉండడముచే వెంటనే వారు రాజు చెప్పిన విదముగా చేసెను. కాని రాజు వారిని ఆట పట్టించుటకై ఆ విధముగా చెప్పే సరికి వణ్డర్ మరియు చొణ్డర్ వెంటనే శ్రీమన్ నారాయణుడిని కాక దేవతాంతరమును ఆశ్రయించితిమని సృహని కోల్పోయెను. దాసర్ అది తెలిసిన వెంటనే అక్కడ్కి వెళ్ళి తన పాద దూళిని వారియందు ఉంచగా వెంటనే సృహలోనికి వచ్చెను. ఈ సంఘటన ద్వారా భాగవతుల పాదధూళి ఒక్కటే మనలని దేవతాన్తర భజనము (ఒకవేళ తెలియక చెసిననూ) నుండి కాపాడునని గ్రహించవచ్చును.
- తిరువాయ్మొళి 1.5.11 – నంపిళ్ళై వ్యాఖ్యానము – “పాలేయ్ తమిజర్ ఇశై కారర్ పత్తర్”, ఆళ్వాన్ ఒకసారి ఈ విదముగా చెప్పిరి “శ్రీ పరాంకుశ నంబి పాలేయ్ తమిళర్ అని (తమిళములో గొప్ప పాండిత్యముకలవారు), ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఇశై కారర్ అని (సంగీత విద్వాంసులు) మరియు పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ పత్తర్ అని (భక్తుడు – గొప్ప భక్తులు)”.
చాలా సంఘటనలు మనకు దాసరులకు కృష్ణ పరమాత్మ యెడల గల గొప్ప అనుభందమును తెలియచేయును.
- తిరువిరుత్తమ్ 95 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఒకసారి ఒక పశువుల కాచే బాలుడు రాజు గారికి పంపే పాలని దొంగలించడముతో ఆ రాజ భటులు ఆ బాలుడిని కొట్టసాగిరి. అది చూసి, దాసర్ ఆ పశువుల కాపరిని కృష్ణుడిగా భావించి భటుల వద్దకి వెళ్ళి ఆ శిక్షని తనకి వేసి బాలుడిని వదలమనిరి.
- నాచ్చియార్ తిరుమొళి 3.9 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – దాసర్ ఈ విధముగా చెప్పిరి “కృష్ణుడు చిన్నవాడు కావడముచే, తనని తాను కాపడుకోలేడని. తన తల్లి తండ్రులు సౌమ్యులు మరియు వారు కారాగారము నందుండిరి. కంసుడు మరియు అతడి అనుచరులు స్వామిని చంపుటకై ఎడురుచూడసగిరి. ఒక్క చీకటి రాత్రి మాత్రమే (ఆ సమయమున కృష్ణుడు పుట్టడముచే) కాపాడగలదని తలిచిరి. అందువలన మనము ఆ చీకటి రాత్రిని కీర్తిద్దాము ఎమ్పెరుమాన్ ని కాపడమని”.
- పెరియాళ్వార్ తిరుమొళి 2.9.2 – తిరువాయ్ మొళి పిళ్ళై వ్యాఖ్యానము – దాసర్ గోపికలు కృష్ణుడు తమ ఇంట వెన్నను దొంగిలించాడని యశోదమ్మకు చెప్పడము విని, కృష్ణుడికి అనుకూల వాదను ఈ విదముగా చెప్పిరి. “అటడు మీ తాళములను పగులగొట్టెనా? లేద అభరణములు ఎత్తుకెళ్ళెనా? మరి ఎందుకు పిర్యాదు చేయుచున్నారు కృష్ణుడిపై? తనకే చాలా ఆవులు ఇంట్లో ఉన్నాయి. అవ్వే చాలా పాలు మరియు వెన్నని ఇస్తున్నాయి. మరి ఎందుకు మీ ఇంట్లో దొంగిలిస్తాడు? అతను తన గృహమేనని మీ ఇంట్లోకి వచ్చాడో ఏమో.
పొన్నాచ్చియార్ కూడా విశ్య పరిజ్ఞానమును కలదని ఎన్నో సంఘటనలు తెలియ చేయును. చరమోపాయ నిర్ణయములో, ఎమ్పెరుమానార్ పొన్నాచ్చియారుల ఉన్నతమైన పరిజ్ఞానమును గ్రహించి తన యొక్క కీర్తిని ఆమె ద్వారా తెలిపెను. ఇక్కడ ఆ పూర్తి సంఘటనలను చదువ వచ్చును. http://ponnadi.blogspot.com/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2.html.
పిళ్ళై లోకాచార్యర్యులు కూడా తమ గొప్పదైన శ్రీ వచన భూషన దివ్య శాస్త్ర మందు పిళ్ళై ఉరంగావిల్లి దాసరుల కీర్తిని ఎమ్పెరుమానులకు మంగళాశాసనమును చేయు సందర్భమున చెప్పిరి.
కొంత కాలము తదుపరి, దాసర్ తమ చివరి రోజుల యందు శ్రీవైష్ణవులందరినీ తమ యొక్క తిరుమాళిగకు పిలిచి, తదీయారాదనమును చేసి, వారి శ్రీపాద తీర్థమును స్వీకరించి, పొన్నాచ్చియారులకు తాను పరమపదమునకు వెళ్తున్నానని చెప్పి ఆమెను ఇక్కడ ఉండవలసినదిగా చెప్పిరి. ఎమ్పెరుమానారుల పాదుకలను తలపై ఉంచుకొని, తమ చరమ తిరుమేనిని వదిలిరి. శ్రీవైష్ణవులు వారి అంతిమయాత్రకు ఏర్పాట్లను చేసిరి, కావేరి నది నుండి పుణ్య జలములను తీసుకువచ్చి, శ్రీచూర్ణ పరిపాలనమును మొదలగు వాటిని చేసిరి. పొన్నాచ్చియార్ దాసర్ పరమపదమునకు తగు ఏర్పట్లను చేసి, శ్రీవైష్ణవుల యందు పూర్తి ద్యాసను కలిగిఉండెను. చివరగా, దాసర్ యొక్క తిరుమేనిని పల్లకిలో ఉంచి వీది చివరకు చేరగానే, దాసరుల ఎడబాటుని సహించలేక బిగ్గరగా ఏడుస్తూ తానూ ప్రాణములను విడిచెను. అందరు శ్రీవైష్ణవులు ఆశ్చర్యమును చెంది దాసర్తో పాటుగా ఆమెకు చరమ సంస్కారములను చేసిరి. ఈ సంఘటన భాగవతులు ఇతర భాగవతులందు కల భందము యొక్క ఎడబాటును ఒక్క క్షణమును భరించరని తెలియచేయును.
మణవాళ మామునిగళ్ ఇయల్ శాత్తుముఱై (ఉత్సవములందు ఇయఱ్పా చివరన అనుంసందిచునవి) వ్రాస్తున్నపుడు, అందరి ఆచార్యుల పాశురములనుండి గ్రహించి. మొదటి పాశురములో వారు పిళ్ళై ఉరంగా విల్లి దాసరుల గురించి మరియు వారు మన సంప్రదాయమునకు సారము వంటి వారని చెప్పెను.
నన్ఱుమ్ తిరువుడైయోమ్ నానిలత్తిల్ ఎవ్వుయిర్క్కుమ్
ఒన్ఱుమ్ కుఱై ఇల్లై ఓతినోమ్
కున్ఱమ్ ఎడుత్తాన్ అడిచేర్ ఇరామానుజన్ తాళ్
పిడిత్తార్ పిడిత్తారై పఱ్ఱి
మనము ఎటువంటి చింతలు లేకుండా అసలైన దనము (కైంకర్యము) కలిగి ఉన్నామని దృవీకరించవలెను. కారణము మనము శ్రీవైష్ణవులకు దాసులము వారు శ్రీ రామానుజులకు దాసులు, వారు స్వయముగా ఎవరైతే తన ప్రియమైన భక్తుల (గోప బాలురు మరియు బాలికలు) రక్షణకై గోవర్దనమును ఎత్తెనో ఆ కృష్ణ పరమాత్మకి దాసులు.
ఈ పాశురములో, దాసర్ ముఖ్యమైన సూత్రములను తెలిపెను:
- శ్రీవైష్ణవులు గొప్ప దనమును కలిగి ఉండెను – కైంకర్య శ్రీ (దాస గుణమనెడి సంపద)
- శ్రీవైష్ణవులు ఎప్పుడూ ప్రాపంచిక విషయములందు భాద పడరాదు.
- శ్రీవైష్ణవులు గొప్ప సంపదగు కైంకర్యశ్రీని ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారుల కృపచే కలిగిఉందురు.
- శ్రీవైష్ణవులు గొప్ప సంపదగు కైంకర్యశ్రీని ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారుల కృపచే కలిగిఉందురు.
చాలా సమయములలో మన పూర్వాచార్యులు ఒక శ్రీవైష్ణవుడి యొక్క గొప్పతనము తన యొక్క జన్మ వర్ణము కారణముచే రాదని చెప్పెను, కానీ ఎమ్పెరుమాన్ మరియు ఇతర శ్రీవైష్ణవులందు భక్తి వలన అది లభించునని తెలిపెను. ఈ ఒక్క సూచన మనకు పిళ్ళై ఉరంగా విల్లి దాసరుల జీవితము ద్వారా తెలియపరచును.
ఈ విదముగా మనమూ పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ మరియు పొన్నాచ్చియారుల జీవితములోని గొప్ప సంఘటనలను కొన్నిటిని తెలుసుకున్నాము. ఇద్దరూ భాగవత నిష్టయందు శ్రద్దని కలిగి ఎమ్పెరుమానార్లకు స్వయముగా ఇష్టులైరి. మనకూ అటువంటి భాగవత నిష్ట లేశమాత్రమైన కలుగువిదముగా వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించుదాము.
పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ తనియన్ :
జాగరూగ దనుశ్పాణిమ్ పాణౌ కట్గసమన్విదమ్
రామానుజస్పర్సవేదిమ్ రాద్దాన్తార్త్త ప్రకాశకమ్
భాగినేయద్వయయుతమ్ భాష్యకార భరమ్వహమ్
రంగేసమంగళకరమ్ దనుర్దాసమ్ అహమ్ భజే
అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్
మూలం: http://guruparamparai.koyil.org/2013/02/22/pillai-uranga-villi-dhasar/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
1 thought on “పిళ్ళై ఉరంగా విల్లి దాసర్”