నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:

nampillai-goshti1

నంపిళ్ళై కాలక్షేప గోష్ఠిలో ఎడమ నుండి మూడవవారు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్

తిరునక్షత్రము: ఆశ్వీజ మాస ధనిష్ఠా నక్షత్రం
అవతార స్థలము: శ్రీరంగం
ఆచార్యులు: తమ తండ్రిగారు మరియు నంపిళ్ళై 
శిష్యులు: వళామళిగియర్
పరమపదించిన స్థలం: శ్రీరంగం
గ్రంథములు/రచనలు: తిరువాయ్మొళి 125000 పడి వ్యాఖ్యానం, పిష్ఠపసు నిర్ణయం, అష్ఠాక్షర  దీపిక, రహస్య త్రయం, ద్వయ పిటకట్టు, తత్త్వ వివరణం, శ్రీ వత్సవింశతి మొదలైనవి.

పరాశరభట్టర్ కి కుమారులని లేదా పౌత్రులని ఐతిహ్యం. వీరు ఉద్ధండ భట్టర్ అని కూడా వ్యవహరింపబడేవారు క్రమంగా నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అను నామధేయంతో స్థిరపడ్డారు.

సూచన: పెరియ తిరుముడి అడైవులో వీరు పరాశర భట్టర్ పుత్రులని, ఆరాయిరప్పడి గురు పరంపరా ప్రభావంలో కూరత్తాళ్వాన్ పౌత్రులని చెప్పబడింది. మరియు ఒక వ్రాత ప్రతి యందు వేద వ్యాస భట్టర్ల ప్రపౌత్రులని పేర్కొనబడింది. వీరి గుర్తింపునకు సరైన స్పష్ఠత దొరకడం లేదు, కాని ఎట్టకేలకు నంపిళ్ళై ప్రియ శిష్యులని మాత్రం చెప్పవచ్చు.

నంపిళ్ళై  వేంచేసి ఉన్న సమయంలో శ్రీరంగమున శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి మరియు భగవత్ అనుభవమునకు సువర్ణ కాలమని చెప్పవచ్చు. ఆ కాలమున సాంప్రదాయమునకు ఏ ఆటంకము రాక అవిచ్ఛిన్నముగా కొనసాగినది. నంపిళ్ళై గారికి అనేక మంది శిష్యులు మరియు అనుచరులుండి వారి కాలక్షేపమునకు క్రమం తప్పకుండా హాజరు అయ్యేవారు. మొదట నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ వీరితో అనుకూలమైన వైఖరితో ఉండేవారు కాదు. నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ పరంపరగా ఉన్నత (ధనవంతుల) కుటుంబములోని వారు కావున అహంభావముతో  నంపిళ్ళై గారికి మర్యాద ఇచ్చేవారు కాదు.

ఒకసారి నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ రాజ భవనానికి వెళుతున్నారు. దారిన  పిన్బళిగియ పెరుమాళ్ జీయరు కనబడగా వారిని కూడ తమతో రాజసభకు రావాలని ఆహ్వానించారు.  జీయర్ వీరి ఉన్నత పరంపరను దృష్ఠిలో ఉంచుకొని గౌరవించి వీరిని అనుసరించిరి. రాజు వీరిద్దరిని మర్యాదగా ఆహ్వానించి ఉచిత ఆసన్నాని ఏర్పరిచారు. రాజు స్వతహాగా ఙ్ఞాని, తాను భట్టర్ ఙ్ఞానమును పరీక్షించదలచి శ్రీమద్రామాయణము నుండి ఒక ప్రశ్నను అడిగారు.

“శ్రీరాముడు తాను సామాన్య మానవునిగా, దశరాథాత్ముజిడిగా చెప్పుకున్నాడు కదా, కాని జటాయువుకు మోక్షము నిచ్చి శ్రీ వైకుంఠమునకు పంపాడు. ఇది తన స్వభావమునకు విరుద్ధము కదా?” భట్టర్ కు ఆ ప్రశ్న వినగానే నోటమాట రాలేదు. ఆ ప్రశ్నకు తగిన సమాధానమివ్వలేక పోయిరి. ఆ సమయాన మహా రాజు రాజకార్య వ్యాకులతతో ఉండిరి. ఆ సమాయమున భట్టర్ తాను జీయర్  వైపు తిరిగి “ఈ ప్రశ్నను నంపిళ్ళై ఎలా వ్యఖ్యానించారు” అని అడిగారు.

జీయర్ ఇలా సమాధనమిచ్చారు, నంపిళ్ళై  దీనికి ఈ శ్లోకం చెప్పారు ‘సత్యేన లోకాన్ జయతి’  – అర్థం సత్యమును పలుకు వారు లోకమున తన ఆధీనంలో ఉంచు కుంటారు – కావున తన సత్యవాక్ పరి పాలనచే లోకమును జయించగలిగారు. భట్టర్ తాను ఙ్ఞానిగా ఆ సమాధానమును రాజు ఈ విషయంలోకి మరలగానే చెప్పారు.

రాజు ఈ స్వతాహాగా ఙ్ఞాని కావున ఈ సమాధానానికి సంతసించి భట్టర్ ను విశేషముగా సన్మానించిరి. భట్ఠర్ తాను నంపిళ్ళై గారి మీద కృతఙ్ఞతా / భక్తి భావముచే తనను వారితో కలుపమని జీయరును ప్రార్థించి నంపిళ్ళైగారి నివాసమునకు వెళ్ళి రాజుచే పొందిన ఆ సంపదనంతటిని వారి శ్రీచరణాల వద్ద సమర్పించిరి.

 భట్టర్ తాను నంపిళ్ళై తో “ఈ సంపదనంతా నేను మీరు వ్యాఖ్యానించిన ఒక చిన్న సమాధానము మాత్రముచే పొందాను” అని తనను తాను నంపిళ్ళై గారికి సమర్పించుకున్నారు. ఇంకా “నేను అన్నింటా చాలా విలువైన మీ సాంగత్యాన్ని / మార్గ దర్శకత్వమును కోల్పోయ్యాను, ఈ నాటి నుండి నేను సాంప్రదాయ రహస్యాలు, వ్యాఖ్యానాలను తమ సన్నిధిన నేర్చుకుంటానని నిర్థారించుకున్నాను” అని అనిరి. దీనికి  నంపిళ్ళై  తాను భట్టర్ ను ఆలింగనం చేసుకొని తనకి సాంప్రదాయ రహస్యాలను, వ్యాఖ్యాలను బోధించారు.

నంపిళ్ళై తిరువాయ్మొళి ని భట్టర్ కు ఉపదేశించారు. భట్టర్  ప్రాతః కాలమును శ్రవణం చేసి  దానిని ధ్యానించి/మననం చేసి రాత్రిన ఆ శ్రవణం చేసిన దానిని విషదంగా గ్రంథస్థ పరిచేవారు. ఆ వ్యాఖ్యానం పూర్తవగానే ఆ గ్రంథస్థ భాగాన్ని నంపిళ్ళై  శ్రీ పాదముల యందు సమర్పించేవారు.

నంపిళ్ళై  125000 పడి (మహా భారత శ్లోక సంఖ్యకు సమానమైన)  గ్రంథస్థ భాగాన్ని పరిశీలించారు. ఈ విస్తారమైన గ్రంథమును చూసి రాబోవు కాలమున ఆచార్య – శిష్య పరంపరగా వచ్చు ఉపదేశ / అభ్యాస పద్ధతిని విస్మరించి కేవలం పఠించి దానికి తన సొంత నిర్ణయాలు తీసుకుంటారు అని భావించి భీతిచెందారు  నంపిళ్ళై.

పిళ్ళాన్ తాను ఆరాయిరప్పడి (విష్ణు పురాణ శ్లోక సంఖ్యకు సమానమైన) వ్యాఖ్యానం రాసేముందు ఎంపెరుమానార్  ఆజ్ఞను తీసుకున్నారని నంపిళ్ళై , భట్టర్ కు తెలిపారు. కాని ఇక్కడ భట్టర్ వ్యాఖ్యానం రాసేందుకు నంపిళ్ళై ఆఙ్ఞ దొరక లేదు. దీనికి భట్టర్ తమరు ఏది ప్రవచించారో అదే వ్రాశాను స్వతాహాగా ఏదీ వ్రాయలేదన్నారు. చివరకు నంపిళ్ళై  ఈ గ్రంథ విడుదలకు ఒప్పుకో లేదు కదా దానిని భిన్నం చేశారు.

 ((సూచన – యతీంద్ర ప్రవణ ప్రభావంలో, ఎప్పుడైతే ఆచార్యులు పరమపదిస్తారో శిష్యులు /సంతానం శిరోముండనం మిగిలినవారు ఆశ్రయిలు (అప్రత్యక్ష శిష్యులు ) ముఖ ముండనం చేయించుకోవాలి.

ఎప్పుడైతే నంపిళ్ళై  పరమపదించారో శిష్యులు చేయవలసిన కర్మయగు శిరోముండనం చేయించు కున్నారు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్. నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ సోదరుడు ఈ చర్యకు బాధపడి అతనితో ఎవరైన కూరేశుల వంశమున జన్మించారా అని ప్రశ్నించారు. దానికి పిళ్ళై భట్టర్ “హో ! నేను కూరత్తాళ్వాన్ వంశమును అగౌరపరిచానా? అని వ్యంగముగా  మీరు ఎలా చెప్పుతున్నారు దీనిని? సమాధానమిచ్చారు. భట్టర్ సోదరులు ఈ వ్యంగపు మాటలు విన లేక నంపెరుమాళ్ సన్నిధికి వెళ్ళి  భట్టర్ మీద ఫిర్యాదు చేశారు. నంపెరుమాళ్, భట్టర్లకు సమన్లు పంపి అర్చక ముఖతగా ఇలా అడిగారు “మేము బతికే ఉన్నా మీరు ఈ చర్యకు పాల్పడ్డారేలా? “(నంపెరుమాళ్  తమకు తాము పరాశర భట్టర్ మరియు వారి వారసులకు తండ్రిగా వ్యవహరించుకుంటారు). దానికి భట్టర్ “ఈ చర్యకు తాము మమ్మల్ని క్షమించాలి” అన్నారు.

వారు ఇంకా “వాస్తవానికి మేము నంపిళ్ళై కు ఆధీనులమయ్యాము, కూరేశుల  (శ్రీ వైష్ణవులకు ఆధీనులగుట) వంశములో వచ్చు వారికి అగు సహజ స్వభావం ఇది, కావున ముఖ ముండనం చేయించుకున్న. కనీస అనుష్ఠానం ఆచరించుటకు శిష్యులు/ సంతానం చేయు కర్మ యగు శిరో ముండనమునకు బదులు మీరు ఈ కనీస మర్యాదకు కూడా చింతిస్తున్నారా?” ఈ సమాధానానికి నంపెరుమాళ్ ఈ భట్టర్లకు నంపిళ్ళైపై ఉన్న అంకిత భావానికి సంతృప్తి చెంది వారికి తమ  మాలా. శఠారి, వస్త్ర మర్యాదను చేయించారు. ఇదీ  నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ యొక్క వైభవం.

ఈ క్రింది వ్యాఖ్యానాలలో కొన్ని సంఘటనలు నడువిల్ తిరు వీధి పిళ్ళై భట్టర్ యొక్క  వైభవమును కీర్తిస్తాయి, వాటిని చూద్దాము.

  • తిరువాయ్మొళి 9.3 – నంపిళ్ళై ఈడు అవతారికలో- ఈ పదిగంలో నమ్మాళ్వార్ తాను నారాయణ నామ (మంత్రం కూడా) కీర్తిస్తున్నారు. సాధారణముగా మూడు వ్యాపక మంత్రాలు ఉన్నవి (ఈ మంత్రాలు భగవానుని వ్యాపకాన్ని / ఉనికిని తెలుపుతాయి) అవి అష్ఠాక్షరి (ఓం నమో నారాయణాయ) షడాక్షరి (ఓం నమో విష్ణవే) ద్వాదశాక్షరి (ఓం నమో భగవతే వాసుదేవాయ). ప్రణవార్థాన్ని, నమః అర్థాన్ని మరియు భగవానుని ఉనికిని మొదలైనవి ఈ మూడు మంత్రాలు చెపుతున్నా ఆళ్వార్  మనసు నారాయణ మంత్రం మాత్రమే తలచును అని నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనుగ్రహించారు.
  • సూచన – ఈ నారాయణ మంత్రం యొక్క ప్రాధాన్యతను  పిళ్ళై లోకాచార్యులు తమ ముముక్షు పడి ఉపోద్ఘాతమున ఉద్ఘటించారు.

వార్తామాలై గ్రంథమున రెండు సంఘటనలు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ గురించి ఉన్నవి, వాటిని తెలుసు కుందాం.

  • 216 – లో నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, నంపిళ్ళై  మరియు పిన్బ అళిగియ పెరుమాళ్ జీయర్ల మధ్య జరిగిన ఒక సంభాషణను ఉట్టంకించారు. జీయర్ ” ఆళ్వార్  (ఎంపెరుమానే సర్వస్వముగా భావించడం మరియు కేవలం ఎంపెరుమాన్  గురించి మాత్రమే ధ్యానించడం) మాదిరి ఉండాలి ప్రతి ముముక్షువు, కాని మేము ఇంకా లౌకిక విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నాము. మరి మేము ఆళ్వార్ మాదిరి ఫలమును (పరమపద కైంకర్య ప్రాప్తి) ఎలా పొందాలి?” అని అడిగిరి. దీనికి నంపిళ్ళై  సమాధానం “మేము కూడా ఆళ్వార్ మాదిరి  పురోగతిని పొందలేక పోతున్నాము ఈ శరీరం ద్వారా, కాని పవిత్రులైన మన ఆచార్యుల అనుగ్రహం వల్ల భగవానుడు చనిపోయు పరమపదాన్ని చేరుకొనేటప్పుడు అలాంటి మానసిక స్థితిని అనుగ్రహిస్తాడు. కావున పరమపదం చేరుకొని మనం పవిత్రులమై కేవలం ఎంపెరుమాన్ కు నిత్యకైంకర్యము  చేయుటలో నిమగ్నమై ఉంటాము” అని అనిరి.

410 నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలో వివరిస్తున్నారు.

  • సంసారులలో దోషములు చూసినప్పుడు వాటిని మనం భగవానుడిలా సంస్కరించ లేము కదా, కావున వాటిని వదిలి వేయాలి.
  • ఎప్పుడైతే భగవానునిపై భారం వేసిన సాత్వికులలో (శ్రీ వైష్ణవవులు) దోషములు గమనించి నప్పుడు వారు తమ దోషములను భగవంతుని కృపచే నశింప చేసుకుంటారు, వారిని కూడ వదిలి వేయాలి.
  • ఒక వ్యక్తి అగ్ని నుండి తన శరీరానికి హాని కలగకుండా ఒంటి నిండా ఎలాగైతే రసాయనాలను లేపనం చేసుకుంటాడో అలాగా మనం కూడా భగవద్ ఙ్ఞానముచే లేపనం చేసుకొని ఈ భౌతిక విషయాల నుండి రక్షింపబడాలి.
  • ఙ్ఞానము రెండు అంశములను కలిగి ఉండును. 1)సంపూర్ణంగా ఆధ్యాత్మిక వాతావరణమును  కలిగిన పరమపదానికి వెళ్ళాలని ధృడ సంకల్పముతో ఉండుట 2) ఈ సంసారము (అఙ్ఞానాంధకారముతో నిండిన) నుండి పూర్తిగా బంధ విముక్తులము అవ్వాలనే ధృడ సంకల్పముతో ఉండుట. అయినను అఙ్ఞానాంధకారముతో నిండిన ఈ సంసార ఙ్ఞానం మనకు తప్పని సరి అవసరము, ఒకవేళ మనం సంసారచ్ఛాయా మాత్రము కలిగి ఉన్న అది మనలను నశింప చేయును.

ఇంతటి వరకు మనం నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ వైభవమును అనుభవించాము. వీరు గొప్ప పండితులుగా ఉండి నంపిళ్ళైకు కు సన్నిహితులుగా ఉండేవారు.

నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ తనియన్:

లోకాచార్య పదాసక్తం మధ్యవీధి నివాసినం|
శ్రీవత్సచిహ్న వంశాబ్ధిసోమం భట్టార్యమాశ్రయే||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

archived in https://guruparamparai.koyil.org, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.koyil.org/2013/04/20/naduvil-thiruvidhi-pillai-bhattar/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://guruparamparai.koyil.org
srIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

1 thought on “నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్”

Leave a Comment