వడుగ నంబి

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

vaduganambi-avatharasthalam

తిరునక్షత్రము : చైత్ర మాసము, అశ్విని

అవతార స్థలము : సాలగ్రామము (కర్నాటక)

ఆచార్యులు : ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము : సాలగ్రామము

గ్రంథ రచనలు : యతిరాజ వైభవము,  రామానుజ అష్టోత్తర శత నామ స్తోత్రము, రామానుజ అష్టోత్తర శత నామావళి

తిరునారాయణ పురమునకు ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానార్ మిథిలా పురి సాళగ్రామమునకు వెళ్ళిరి, వారు ముదలియాణ్డాన్ ను అక్కడ ప్రవహించే నదిలో శ్రీ చరణములతో తాకమని ఆఙ్ఞాపించిరి. ఆ నదిలో స్నానము ఆచరించడము వలన అక్కడి ప్రజలు (ముదలియాణ్డాన్ పాద పద్మముల స్పర్శచే) పునీతులై ఎమ్పెరుమానార్ లకు శిష్యులైరి. అందులో ఒక స్వామి వడుగ నంబి, వీరిని ఆంద్ర పూర్ణులు అని కూడా వ్యవహరించుదురు. ఎమ్పెరుమానార్ తన కృపా కటాక్షముచే వడుగ నంబిని అశీర్వదించి, మన సంప్రదాయములోని ముఖ్య సూత్రములను ఉపదేశించిరి. వడుగ నంబి ఆచార్య నిష్ఠతో ఎమ్పెరుమానారులను సేవించి వారితో ఉండసాగిరి.

వడుగ నంబి పూర్తిగా ఆచార్య నిష్ఠతో ఉండడమువలన ఎమ్పెరుమానారులను అర్థించి వారు ధరించిన పాదరక్షలకు ప్రతీ నిత్యము తిరువారాధనమును చేయసాగిరి.

ఒకసారి ఎమ్పెరుమానారుతో కూడి ప్రయాణించు సమయములో,  ఎమ్పెరుమానార్ల తిరువారాధన పెరుమాళ్ళతో కూడి, వడుగ నంబి కూడా వారి తిరువారాధన మూర్తులైన (ఎమ్పెరుమానారుల పాదరక్షలు) ఒకే మూటలో ఉంచిరి. ఎమ్పెరుమానార్ అది గమనించి వడుగ నంబిని అలా చేయుటకు గల కారణమును అడిగిరి. వడుగ నంబి వెంటనే ఈ విదముగా చెప్పిరి “నా ఆరాధన మూర్తి కీర్తిలో మీ ఆరాధన మూర్తులతో సమానము అందువలన ఇలా చేయుటలో తప్పేమి లేదనిరి”.

ఎమ్పెరుమానార్ ఎల్లప్పుడూ మంగళాశాసనము చేయు సమయములో,  పెరియ పెరుమాళ్ళ అందమైన రూపమును సేవిస్తూ ఆనందించేవారు. ఆ సమయములో వడుగ నంబి ఎమ్పెరుమానార్ల అందమైన రూపమును చూసి ఆనందించేవారు. ఎమ్పెరుమానార్ అది గమనించి వడుగ నంబిని పెరియ పెరుమాళ్ళ అందమైన నేత్రములను సేవించి అనందించమనిరి. వడుగ నమ్బి తిరుప్పాణాళ్వార్ల శ్రీ సూక్తిని అనుసరించి ఈ విధముగ చెప్పిరి “ఎన్ అముదినై కణ్డ కణ్గళ్ మఱ్ఱొన్ఱినై కాణావే” అర్థము “ఎమ్పెరుమానారుల దివ్య సౌందర్యమును దర్శించిన ఈ నేత్రములు వేటిని చూడదలచలేదు”. ఎమ్పెరుమానార్ వారి యొక్క ఆచార్య నిష్ఠను చూసి సంతోషముతో ఆశీర్వదించిరి.

వడుగ నంబి నిత్యమూ ఎమ్పెరుమానారుల శేష ప్రసాదమును తీసుకొనెడివారు, ఆపై వారి చేతులను భక్తితో తలపై తుడుచుకొనేవారు (చేతులను కడుగుటకు బదులుగా) – సాధారణముగా ఎమ్పెరుమాన్  / ఆళ్వార్ ఆచార్యుల ప్రసాదములు పవిత్రములు అవడముచేత తీసుకొన్న పిదప ఇలానే చేస్తాము, స్వీకరించిన తదుపరి, మనము చేతులను కడుగరాదు, చేతులను మన తలపై తుడుచుకొనవలెను. ఒకసారి ఎమ్పెరుమానార్ అది గమనించి కలవరపడగా, నంబి తమ చెతులను శుబ్రముచేసుకొనిరి. మరుసటి రోజు, ఎమ్పెరుమానార్ భగవత్ ప్రసాదమును స్వీకరించి మిగిలినది వడుగ నంబికి ఇచ్చిరి. వడుగ నంబి స్వీకరించి చేతులను కడుగుకొనిరి. ఎమ్పెరుమానార్ మరలా కలత చెంది ప్రసాదమును స్వీకరించి చేతులను ఎందుకు కడుక్కొన్నారనిరి. వడుగ నంబి,వినయముతో మరియు తెలివిగా “నేను దేవర వారు నిన్న ఆఙ్ఞాపించిన విదముగా నదుచుకుంటున్నాను అని చెప్పిరి”. ఎమ్పెరుమానార్ “మిరు నన్ను చాలా సులభముగా ఓడించినారు” అని చెప్పి వారి నిష్ఠను అభినందించిరి.

ఒకసారి వడుగ నంబి ఎమ్పెరుమానార్ కోసము పాలను కాచుచున్నారు. ఆ సమయమున, నమ్పెరుమాళ్ పుఱప్పాడులో బాగముగా ఎమ్పెరుమానారుల మఠము ముందుకు వచ్చెను. ఎమ్పెరుమానార్ వడుగ నంబిని వచ్చి సేవించమని పిలువగా వారు “నేను మీ పెరుమాళ్ళను చూచుటకు వస్తే,నా పెరుమాళ్ళ పాలు పొంగిపోవును. అందువలన నేను రానని చెప్పెను”.

ఒకసారి వడుగ నంబి బందువులు (వారు శ్రీవైష్ణవులు కారు) వారిని చూచుటకు వచ్చిరి. వారు వెళ్ళిన తదుపరి, వడుగ నంబి పాత్రలను అన్నీ పడేసి ఆ ప్రదేశమును శుబ్రము చేసెను. ఆపై ముదలియాణ్డాన్ తిరుమాళిఘకు వెళ్ళీ, వారు వదిలివేసిన కుండలను తీసుకొని వచ్చి ఉపయోగించసాగిరి. ఈ సంఘటన ద్వారా ఎవరైతే పూర్తి ఆచార్య సంభదమును కలిగి ఉంటారో వారికి సంభదించినవి (వారు వదిలివేసినవి అయినా) పవిత్రములుగా భావించి మనమూ స్వీకరించవచ్చు అని తెలియపరచును.

vaduganambi-emperumanar

ఎమ్పెరుమానార్ తిరువనంతపురమునకు వెళ్ళినప్పుడు,  అనంత శయన ఎమ్పెరుమాన్ ఆలయములోని ఆగమమును మార్చదలచెను. కాని ఎమ్పెరుమాన్  ప్రణాళిక వేరుగా ఉండడముచే ఎమ్పెరుమానార్ నిద్రించుచున్న సమయమున ఎత్తుకొని వెళ్ళి తిరుక్కురుంగుడి దివ్య దేశమున వదిలి వచ్చెను. ఎమ్పెరుమానార్ ఉదయము లేచి పక్కన నదిలో స్నానమును ఆచరించి, ద్వాదశ ఊర్ద్వ పుండ్రములను (12 పుండ్రములు) దరించి వడుగ నంబిని (వారు తిరువనంతపురములోనే ఉండెను) శేషమును స్వీకరించుటకు పిలిచిరి. తిరుక్కురుంగుడి నంబి స్వయముగా వడుగ నంబి వలె వచ్చి తిరుమణి ని దరించెను. ఎమ్పెరుమానార్ తదుపరి తిరుక్కురుంగుడి నంబిని శిష్యుడిగా స్వీకరించిరి.

ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన తరువాత, వడుగ నంబి తమ స్వస్థలమునకు వెచ్చేసి, అక్కడ ఎమ్పెరుమానారుల వైభవమును ప్రవచిస్తూ ఉండెను. వారు ఎమ్పెరుమానారుల శ్రీ పాద తీర్థమును (చరణామృతము)తప్ప వేరవరిదీ స్వీకరించెడి వారు కారు. ఎమ్పెరుమానారుల శ్రీ చరణములను ఆరాదిస్తూ వారి శిష్యులకి / అభిమానులకి ఎమ్పెరుమానారుల తిరువడిని చేరుటయే అంతిమ ఉద్దేశ్యమని చెప్పి మిగిలిన కాలమును సాలగ్రామమున నివసించి ఎమ్పెరుమానార్ తిరువడిని చేరిరి.

మన వ్యాఖ్యానములలో, కొన్ని ఐదిహ్యములు వడుగ నంబి కీర్తిని తెలుపును.మనమూ వాటిని ఇక్కడ చుద్దాము.

  • పెరియాళ్వార్ తిరుమొళి 4.3.1 – మణవాళ మాముణులు వ్యాఖ్యానము – ఈ పదిగములో  “నావ కారియమ్” అను పదమును గురించి. ఒక సంఘటనను వడుగ నంబి జీవితములో గమనించవచ్చు. ఒకసారి వడుగ నంబి దగ్గర ఒక శ్రీవైష్ణవుడు తిరు మంత్రమును అనుసందించెను. అది విని వడుగ నంబి (ఆచార్య నిష్ఠచే)  “ఇది నావ కారియమ్” అని చెప్పి వెళ్ళిపోయెను. ఇది ముఖ్యముగా మనము తిరుమంత్రము, ద్వయము, చరమ శ్లోకము –అనుసందిచుటకు మొదలు గురు పరంపరను అనుసందిచవలెనని ఆపై రహస్య త్రయమును అనుసందించవలెననీ తెలియచేయును.  పిళ్ళై లోకాచార్యర్యులు ఇది గుర్తించి “జప్తవ్యమ్ గురు పరమ్పరైయుమ్ ద్వయముమ్” (ప్రతీ ఒకరు తప్పక గురు పరంపర తదుపరి ద్వయ మహా మంత్రమును అనుసందించవలెను) శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రమ్ 274) తెలిపిరి.
  • పెరియాళ్వార్ తిరుమొళి 4.4.7 – మణవాళ మాముణులు వ్యాఖ్యానము – వడుగ నంబి పరమపదము చేరిన పిదప, ఒక శ్రీవైష్ణవుడు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుతో “వడుగ నమ్బి పరమపదమును చేరిరి” అని చెప్పెను. దానికి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఈ విదముగా అనెను “వడుగ నంబి ఆచార్య నిష్ఠులు కావున, మీరు వారు ఎమ్పెరుమానార్ తిరువడిని చేరినారని చెప్పవలెను, పరమపదమునకు కాదు అనెను”.
  • వడుగ నంబి యతిరాజ వైభవమును తెలుపు ఒక అందమైన గ్రంథమును రచించిరి. ఈ గ్రంథములో వారు ఎమ్పెరుమానార్ 700 సన్యాసులతో, 12000 శ్రీవైష్ణవులతో, ఇతర శ్రీవైష్ణవులెందరితోనో ఆరాదించబడెను అని పేర్కొనెను.

పెరియ వాచ్చాన్ పిళ్ళై మాణిక్క మాలైలో “వడుగ నంబి ఆచార్య అను పదము (స్థానము) చాలా ప్రత్యేకము మరియు దీనికి ఎమ్పెరుమానార్ ఒక్కరే సరితూగుదురని చెప్పెను”.

పిళ్ళై లోకాచార్యులు వడుగ నంబి గారి గొప్పతనమును శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రం 411) వివరించిరి.

వడుగ నంబి ఆళ్వానైయుమ్ ఆణ్డానైయుమ్ ఇరుకరైయర్ ఎన్బర్

మాముణులు వడుగ నంబిని మధురకవి ఆళ్వార్లతో పోల్చెను కారణము వారికి నమ్మాళ్వారులే సర్వస్వము.  కూరత్తాళ్వాన్ మరియు ముదలియాణ్డాన్ ఎమ్పెరుమానారుకి పూర్తిగా దాసులైనా –కొన్ని సమయములలో వారు ఎమ్పెరుమాన్ ని కీర్తించి సంసారములో ఇమడ లేక ఎమ్పెరుమాన్ ని మోక్షము ప్రసాదించవలెననీ అభ్యర్థించిరి. అందువలన వడుగ నంబి “వారు ఎమ్పెరుమానారుకి చెందిన వారైనా, వారు ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానార్లను పట్టుకొనిరి ”అని చెప్పెను.

చివరగా ఆర్తి ప్రభందములో (పాశురము 11), మాముణులు వడుగ నంబి స్థానమును గుర్తించి తీవ్రమైన తృష్ణతో ఎమ్పెరుమానార్లని వారిని వడుగ నంబి వలె అనుగ్రహించమని వేడుకొనెను. వడుగ నంబికి ఎమ్పెరుమానార్ పై అపారమైన నమ్మకముచే ప్రత్యేకముగా ఎమ్పెరుమాన్ ని ఆరాదించలేదు. దీని ద్వారా మన పూర్వాచార్యులు ఎవరైతే ఆచార్యులను ఆరాదించుదురో, స్వయముగా ఎమ్పెరుమాన్ ని ఆరాదించినట్టే అని తెలిపిరి. కాని మనము ఒక్క ఎమ్పెరుమాన్ ని ఆరాదిస్తే, ఆచార్యులను ఆరాధించినట్లు కాదు. అందువలన మన సంప్రదాయములో ఆచార్యుల ఆఙ్ఞలను పాఠించడమే ముఖ్యమైన సూత్రము, మాముణులు ఇది వడుగ నంబిలో పూర్తిగా ఉండెనని గుర్తించిరి. వడుగ నంబి గారి జీవితములోని కొన్ని ముఖ్య సంఘటనలను ఇక్కడ చూసాము. వీరు పుర్తిగా భాగవత నిష్ఠతో ఉండి ఎమ్పెరుమానారుకి ప్రియ శిష్యులైరి. మనకూ అటువంటి ఆచార్య నిష్ఠ కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

వడుగ నంబి తనియన్ :

రామానుజార్య సచ్చిశ్యమ్ సాళగ్రామ నివాసినమ్
పంచమోపాయ సంపన్నమ్ సాళగ్రామార్యమాశ్రయే

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.koyil.org/2013/04/01/vaduga-nambi/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org