శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:
తిరునక్షత్రము: మాసి, మగం (మాఘ మాసము – మఖ నక్షత్రము)
అవతార స్థలము: తిరుమాలిరుంచోలై
ఆచార్యులు: ఆళవందార్
శిష్యులు: ఎంపెరుమానార్ (గ్రంథ కాలక్షేప శిష్యులు)
ఆళవందార్ ప్రధాన శిష్యులలో తిరుమాలై ఆండాన్ ఒకరు. వీరిని మాలాధారులు, శ్రీ ఙ్ఞాన పూర్ణులు అని కూడా అంటారు. ఆళవందార్ ఐదుగురు శిష్యులకు సంప్రధాయములోని లోతులను ఎంపెరుమానార్కు ఉపదేశించటము కోసము నియమించారు. తిరువాయ్మొళిలోని అర్థములను చెప్పటము కోసము తిరుమాలై ఆండాన్ను నియమించారు. ఆళవందార్ పరమపదము చేరిన పిదప ఎంపెరుమానార్ శ్రీరంగము చేరుకున్నారు. అప్పుడు తిరుక్కోష్తియూర్ నంబి ఎంపెరుమానారును తిరుమాలై ఆండాన్ వద్ద నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలోని లోతులను తెలుసుకోమని ఆదేశించారు.
తిరుమాలై ఆండాన్ తిరువాయ్మొళిలోని అర్థములను చెప్పే సమయములో తాను ఆళవందార్ దగ్గర విన్న విషయములను వివరించగా, ఎంపెరుమానార్ ఆయా పాశురములకు వేరే అర్థములను చెప్పటము చూసి ఈయన యేదో విశ్వామిత్ర సృష్ఠి చేస్తున్నారని భావించేవారు.
ఒక సారి తిరువాయ్మొళిలోని 2.3.3 “అరియా క్కాలత్తుళ్ళే” పాశురమునకు ఆండాన్, “నమ్మాళ్వార్ పరమాత్మ తనకు ఙ్ఞానము నిచ్చి కూడా ఇంకా ఈ సంసారములోనే వుంచార” ని, విషాదముగా ఈ పాశురము పాడారని చెప్పారు. కాని ఎంపెరుమానార్ అదే పాశురములోని రెండవ పాదమును ముందు తీసుకొని నమ్మాళ్వార్ “ఇప్పటి దాకా ఈ సంసారములో ఉంచావు. ఇప్పుడు నీకు నా మీద దయ కలిగి నన్ను కరుణంచావు’ అని అన్నారని వివరించారు. “ఆళవందార్ చెప్పిన అర్థము ఇలా లేదు మీరు కొత్తగా విశ్వామిత్ర సృష్ఠి చేస్తున్నారని” కాలక్షేపము నిలిపివేసారు. ఈ విషయము తెలిసిన తిరుక్కోష్టియూర్ నంబి తిరుక్కోష్టియూర్తి నుండి శ్రీరంగమునకు వచ్చి, ఆండాన్ను విషయమేమిటని అడిగి తెలుసుకొని” ఆళవందార్ కూడా ఇలాగే చెప్పారు. మీరు బహుశా అరోజు రాలేదేమో. శ్రీ కృష్ణుడు, సాంధీపని వద్ద విద్య నేర్చుకున్నట్టే, ఎమ్పెరుమానార్లు మన దగ్గర తిరువాయ్మొళి నేర్చుకుంటున్నారని సర్ధి చెప్పి మళ్ళీ కాలక్షేపము కొనసాగే ఏర్పాటు చేసారు. ఆండాన్ని, పెరియ నంబిని ఎంపెరుమానార్ మఠమునకు తీసుకువచ్చి ఆండాన్ దగ్గర కాలక్షేపము కొనసాగించమని ఎంపెరుమానారును కోరారు. తిరిగి ఒక సారి ఎంపెరుమానార్ ఇలాగే ఒక పాసురమునకు వేరే అర్థము చెప్ప్గగా, ఆండాన్ “మీకు ఈ అర్థములు ఎలా తెలుస్తున్నాయ”ని అడిగారు దానికి ఎంపెరుమానార్ “ఆళవందారుకు నేను ఏకలవ్య శిష్యుడను.” అన్నారు. ఆళవందార్ వారి గొప్పతనము తెలుసుకొని సంతోషించి అప్పటి నుండి ఎంపెరుమానార్ చెప్పే అర్థములను ఆనందముగా వినేవారు.
ఈ రకముగా పాశురముల వ్యాఖ్యానములో ఎంపెరుమానార్ ఆండాన్తో విభేషించినవి చాలా వున్నాయి. వాటిలో కొన్నింటిని చూద్దాము.
- తిరువాయ్మొళి 1.2 – నంపిళ్ళై వ్యాఖ్యానము – “వీడు మిన్ ముత్తవుం” పదిగము ఆండాన్ వివరిస్తూ ఎంపెరుమానారుతో ఇది “ప్రపత్తి యోగముగమ” ని తనకు ఆళవందార్లు బొధించారని చేప్పారు. ఎంపెరుమానార్ అప్పుడు ఊరుకున్నా శ్రీ భాష్యము పూర్తి చేసిన తరవాత ఉపన్యాసాలలో “భక్తి యోగం”ని చెప్పేవారు. ప్రపత్తి చాలా నిఘూడమైనది భాష్యము చేసేవారి చేతిలో పదితే అతి సులభముగా మార్చేస్తారు. ఇది “సాధ్య భక్తి ” (పరమాత్మకోసమే భక్తి చేయటము అందులో అణు మాత్రము కూడ స్వప్రవృత్తి ఉండరాదు) ఇది ఉపాయము, సాధన భక్తి కంటే భిన్నమైనది. ఎంబార్ కూడా ఎంపెరుమానార్ విధానమునే అనుసరించారు.
- తిరువాయ్మొళి 2.3.1- “తేనుం పాలుం కన్నలుం అముథుమొత్తే – కలందొళింతోం” అనే పాశురము ఆండాన్ “అళ్వార్లు పరమాత్మ,తను తేనె, తేనె లానో పాలు, పాలు లానో కలిసిపోయాయి” అని ఆళవందార్ మాకు చెప్పారన్నారు. కాని ఎంపెరుమానార్ ఒక్క పాలో, తేనో కాదు. తేనె, పాలు, పంచదార ఇంకా అనేక మధుర పధార్థాలు కలిసి పోయిన్నట్టు ఒక కొత్తరుచిని అనుభవించామని చెప్పడమే ఆళ్వార్ల ఉద్దేశ్యమని వివరించారు.
నాచియార్ తిరుమొళి 11.6 వ్యాఖ్యానములో, ఆండాన్ ఈ వ్యాఖ్యానములో ఏమి చెప్పారంటే “ఈ శరీరముతో గల అన్ని సంబంధములను, శరీరము మీది అభిమానమును కూడా వెదిలి వేసినా, ఈ శరీరమును తృణీకరించరాదు. ఇది ఆళవందార్ల సంబంధము గలది. ”అనటము చూసి పెరియ వాచ్చాన్ పిళ్ళై ఆణ్దాన్ యొక్క ఆచార్య భక్తిని గుర్తించారు. చరమోపాయ నిర్ణయములో నాయనార్ ఆచాన్ పిళ్ళై తిరుమాలై ఆండాన్ ”పొలిగ పొలిగ” పాశురము (తిరువాయ్మొళి 5.2) అర్థమును వివరిస్తున్న సమయములో, తిరుక్కోష్ఠియూర్ నంబి గోష్టిలో, ఈ పాశురము ఎంపెరుమానార్ల గురించి ఆళ్వార్లు చెప్పినదని ప్రకటించారు. అది వినగానే, ఆండాన్ సంతోషంగా ఎంపెరుమానార్ నాకు ఆళవంధార్లతో సమానమన్నారు (స్వాచార్యులు).
అంతటి ఆచార్య నిష్ఠ గల ఆండాన్ కృప సదా మనపై వుండాలని కోరుకుందాము.
తిరుమాలై ఆణ్దాన్ తనియన్
రామానుజ మునీంద్రాయ ద్రామిడీ సంహితార్థధం
మాలాధర గురుం వందే వావధూకం విపస్చితం
ఆధారము: 6000పడి (ఆరాయిర పడి) గురు పరంపరా ప్రభవం, పెరియ తిరుముడి అడైవు, వ్యాఖ్యానము, యం. ఏ. వి. స్వామి “వాళ్వుం వాక్కుం”.
అడియేన్ చూడామణి రామానుజదాసి
మూలము: https://guruparamparai.koyil.org/2013/02/24/thirumalai-andan/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
2 thoughts on “తిరుమాలై ఆండాన్”