మాఱనేఱి నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

alavandhar-deivavariandan-maranerinambi

ఆళవందార్ (మధ్యలో) దైవవారి ఆణ్డాన్ మరియు మాఱనేఱి నంబి – శ్రీ రామానుజుల సన్నిధి, శ్రీ రంగము

తిరునక్షత్రము : ఆని, ఆశ్లేష (ఆయిలము)

అవతార స్థలము : పురాన్తకము (పాండ్యనాడులో చిన్న పట్టణము)

ఆచార్యులు : శ్రీ ఆళవందార్

పరమపదించిన చోటు : శ్రీ రంగం.

మాఱనేఱి నంబి గారు శ్రీ ఆళవందార్లకి ప్రియమైన శిష్యులలో ఒకరు. వీరికి ఉన్న ఆచార్య నిష్ఠను చూసి మరియు ఆ పెరియ పెరుమళ్ పై ఉన్న భక్తి కి శ్రీరంగమున అందరిచే చాలా గౌరవించ బడేవారు.

వీరు నమ్మళ్వారుల (మాఱన్) వలె ఎప్పుడూ భగవత్ భక్తి లో ఉండుట చేత వీరిని మాఱనేఱి నంబి అని పిలిచేవారు.

వీరు ఎప్పుడు సదా వారి ఆచార్యుల అయిన ఆళవందారుల కాలక్షేపములును వింటూ సదా శ్రీరంగ ప్రాకారమున నివసిస్తూ ఉండేవారు.

మాఱనేఱి నంబి గారి అంత్యదశలో ఉన్నప్పుడు వారికి అత్యంత అప్తులైన పెరియనంబి గారిని పిలిచి వారి తిరుమేనిని (శరీరంను) వారి శరీర బందువులు అవైష్ణవులు అవ్వుట చేత వారికి ఇవ్వవద్దు అని చెప్పినారు. మాఱనేఱి నంబి గారు వారి శరీరము హవిస్సు లాంటిదని అది ఒక్క భగవానునికే చందవలిసినది అని దానిని ఇతరులు తాకరాదు అని భావించారు. మాఱనేఱి నంబి గారు పరమపదించిన తరువాత పెరియనంబి గారు మాఱనేఱి నంబి గారికి అంత్య సంస్కారములను చేసినారు. మాఱనేఱి నంబి గారు చతుర్థ వర్ణము చెందినవారు కావడము వలన అక్కడ నివసించే వైష్ణవులు పెరియనంబి గారి చేసిన పనిని తప్పుబట్టేరు. ఈ విషయమును రామానుజులుకి చేప్పినారు అప్పుడు రామానుజులు పెరియనంబి గారి నోటి ద్వారా మాఱనేఱి నంబి గారి వైభవమును తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నారు. రామానుజులు పెరియ నంబి గారిని పిలిచి మేము శాస్త్రము పై విశ్వాసమును పెంచుటకు ప్రయత్నము చేస్తుంటే మీరు ఇలా శాస్త్ర విరుద్దముగా చేయుచున్నారేమి అని అడిగిరి? అప్పుడు పెరియనంబి గారు “భాగవతులకి కైంకర్యము చేయుటలో ఇంకొకరికి అప్పగించుట తగదు అని, మనమే దగ్గర ఉండి చేయాలని చెప్పుట చేత అలా చెసాను అని “శ్రీ రామ చంద్రుడు జటాయుకి దగ్గర ఉండి తానే చరమ కైంకర్యమును చేసెను అని అందుచే తాను శ్రీ రామ చంద్రుడు కంటే గొప్పవాని కాను అని, మాఱనేఱి నంబి గారు జటాయు కంటే తక్కువ కాదు అని” అందుచే ఈ కైంకర్యమును చేసినామని అని చెప్పినారు. పయిలుమ్ చుడరొళి (తిరువాయ్మొళి 3.7) మరియు నెడుమాఱ్కడిమై (తిరువాయ్మొళి 8.10) పదిగమున నమ్మాళ్వారుల భాగవత శేషత్వమును గూర్చి చెప్పినారు. అందుచే మనము అళ్వారుల హృదయ భావమును తేలుసుకొవాలని పెరియ నంబి గారు చేప్పినారు. ఇది విన్న శ్రీరామానుజులు చాల సంతోషించి రామానుజులు, పెరియ నంబి గారిని అభినందించారు. శ్రీరంగములో వున్న శ్రీవైష్ణవులు అందరూ సంతోషించారు. పిళ్ళై లోకాచార్యులు వారి శ్రీ వచన భూషణముకి భాష్యము వ్రాసిన మణవాళ మహాముణులు 234 సూత్ర వ్యాఖ్యానము లో ఈ విషయమును వివరించారు.

మాఱనేఱి నంబి గారి వైభవమును తెలుపు కొన్ని వ్యాక్యానములును చుద్దాము.

తిరుప్పావై 29 – ఆయి జననాచార్యర్ వ్యాఖ్యానము:

ఈ పాశుర వ్యాఖ్యానమున పెరియనంబి గారికి రామానుజులుకి జరిగిన సంభాషణములను చెప్పబడినది. మాఱనేఱి నంబిగారు వారి చివరి దశలో చాలా శరీర బాదకి లోనవుతారు. అందుచే చివరి సమయమున భగవంతుని స్మరించలేదు అని అందుచే వారికి మోక్షము వస్తుందా? అని పెరియనంబి గారు రామానుజులుని అడిగేరు. అప్పుడు రామానుజులు, వరహ పెరుమాళ్ యొక్క చరమ శ్లోకమును గుర్తు చేసి అయినని స్మరణ చేయుట చేతను మోక్షము ఇస్తాను అన్న వరాహ పెరుమాళ్ చేప్పిన వ్యాక్యనములును గుర్తుచేసారు. దానికి పెరియ నంబి గారు అంగీకరించక భుమి దేవి యొక్క సంతోషము కొసం వరాహ స్వామి అలా చేప్పివుంటారు అని పెరియ నంబి గారు రామానుజులుతో అన్నారు. రామానుజులు “త తో ఎప్పుడు వున్న భుదేవికి వరాహ స్వామి అలా సరదాకి చేప్పరు” అని అన్నారు. అయినా పెరియ నంబి గారు అంగీకరించక ప్రమాణమును చూపమన్నారు. భగవద్గీత 4.10 – “జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవమ్ యో వేత్తి తత్వత: త్యక్త్వా దేహమ్ పునర్ జన్మ నైతి మామేతి సోర్జున” శ్లొకమున పరమాత్మ తన గురించి, తన దివ్య జన్మను గురించి యతార్థముగా తేలుసుకున్న వారికి మరల జన్మ వుండదు అని, వారు పరమపదమును చేరుతారు అని చెప్పగ పెరియ నంబి గారు చలా సంతోషించారు.

పెరియ తిరుమొళి 7.4 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము ఉపొత్ఘాతమున – (కణ్సోర వెన్కురుతి) అను పదిగమున తిరుమంగై ఆళ్వార్లు, “తిరుచ్చేరై అను దివ్యదశమున వేం చేసి వున్న సారనాథ పెరుమాళ్ళకి శరణాగతి చేసిన శ్రీవైష్ణవుల భాగ్యమును కొనియాడేరు.”ఈ పాశుర వ్యాఖ్యానమున పెరియ నంబి గారు మాఱనేఱి నంబి గారికి చేసిన చరమ కైంకర్యమును ప్రస్తావించారు.

ముదల్ తిరువందాది 1 – నంపిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురము వ్యాఖ్యానమున ఎవరో ఒక సారి మాఱనేఱి నంబి గారిని “భగవంతుని సదా మరవక ఎప్పుడూ ఆయన స్మరణ చెయుట ఎట్లు?” దానికి మాఱనేఱి నంబి గారు అసలు భగవంతుని మరచుట యెట్లొ మీరు చెప్పండి అని అడిగారు అట. (మాఱనేఱి నంబి గారు సదా ఆ భగవంతుని ధ్యానములో ఉండుట చేత, వారు భగవంతుని మరుచుట జరగదు.)

శ్రీ వచన భూషణము 324 – పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహితము – ఒక వర్ణములో పుట్టుట ద్వారా శ్రీవైష్ణవుల వైభవము ముడిపడదు అని, ఆచరణా ప్రయమైన మాఱనేఱి నంబి గారి వైభవము చెప్పడము అయినది. ఇక్కడ పెరియ నంబి గారు మాఱనేఱి నంబి గారికి చేసిన చరమ కైంకర్యమును వర్ణించారు.  మనవాళ మాముణులు  కుడా తమ యొక్క వ్యాఖ్యానములలోఈ చరమ కైంకర్యము యొక్క సారమును గురించి వర్ణించారు.

ఆచార్య హృదయము 85 – అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, తమ యొక్క అన్నగారైన (పిళ్ళై లోకాచార్యులు) బాటలోనే నడచి, మాఱనేరి నంబి యొక్క వైభవమును తమ యొక్క చూర్ణికలో ఈ వృత్తాంతమును వివరించిరి.

ఆ విధముగా, మనము మాఱనేరి నంబి గారి కొన్ని వైభవములను తెలుసుకుంటిమి.

మనము మాఱనేరి నంబి గారికి ఆళవందారులకు గల సంబంధమును కలుగు విధముగా వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించి.

గమనిక : నంబి గారి తిరు నక్షత్రము పెరియ తిరుముడి అడైవులో ఆడి – ఆయిలము అని ఉండినది కాని ఆని – ఆయిలము అని వారి యొక్క వాళి తిరునామములో చెప్పబడినది.

మాఱనేరి నంబి వారి తనియన్

యామునాచార్య సచ్చిష్యమ్ రంగస్థలనివాసినమ్
ఙ్ఞానభక్త్యాదిసమ్పన్నం మాఱనేరిగురుమ్ భజే

అడియేన్ సురేష్ కృష్ణ రమానుజ దాసన్

మూలము: http://guruparamparai.koyil.org/2013/03/02/maraneri-nambi/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

3 thoughts on “మాఱనేఱి నంబి”

Leave a Comment