పెరియ తిరుమలై నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

periya-thirumalai-nambi

తిరు నక్షత్రము: వైశాఖ మాసము,స్వాతి

అవతార స్థలము: తిరువేంకటము

ఆచార్యులు: శ్రీ ఆళవన్దార్

శిష్యులు: రామానుజులు (గ్రంథ కాలక్షేప శిష్య), మలైకునియ నిన్ఱ పెరుమాళ్, పిళ్ళై తిరుక్కులముడైయార్, భట్టారియరిల్ శఠగోపదాసులు.

శ్రీ తిరుమల నంబి గారు శ్రీ వేంకటనాథుని కృపతో తిరుమలలో జన్మించారు. వీరు శ్రీ ఆళవందార్ శిష్యులలో ప్రధానులు. వీరికి ఆ వేంకటనాథుని పైన ఉన్న ప్రేమ చేత ఆ భగవంతుడే వీరిని “పితామహ” అని పిలిచి బిరుదు ఇచ్చినారు.

శ్రీ ఆళవందార్లు వారి అయిదు ప్రధాన శిష్యులుకు అయిదు ప్రధాన బాధ్యతలను ఉడయవర్ విషయములో అప్పగించిరి. తిరుమల నంబి గారిని మన సాంప్రదాయములో శరణగాతి శాస్త్రమైన రామాయణమును రామానుజులకి అనుగ్రహించమనిరి.

భగవత్ రామానుజులకి వీరు స్వయముగా మేనమామ అవుతారు. వీరు రామానుజులకి “ఇళయాళ్వార్” అని నామకరణమును చేసిరి. వీరు తిరుమలలో నిత్య కైంకర్యపరులు. తిరువేంకటనాథునికి నిత్యము ఆకాశ గంగ తీర్థమును తెచ్చేవారు.

భగవత్ రామానుజులు వారి పిన్ని కొడుకు అయిన గోవిందుడుని మరల శ్రీ వైష్ణవ సంప్రదాయములోకి తీసుకురావలనే ఆకాంక్షతో (గోవిందుడు తాను కాశీ యత్రలో ”ఉళ్ళన్గై కొణర్న్త నాయనార్” గా పిలువబడి శ్రీ కాళహస్తిలో దేవతాన్తరమును పూజిస్తు వుండి పోయారు). వారి వద్దకు వెళ్ళి వారిని మార్చే బాధ్యతను తీసుకోవలసిందని తిరుమల నంబి గారికి ఒక శ్రీ వైష్ణవుడి ద్వారా విన్నవిన్చినారు.

గోవింద్ పెరుమాళ్ని చూడడానికి తిరుమల నంబి గారు వారి శిష్యులు మరియు శ్రీ వైష్ణవుల (వారు మరల శ్రీ రంగం చేరి ఎమ్పెరుమానార్ల తో జరిగిన సంఘటన తెలియజెస్తారు) తో కలిసి శ్రీ కాళహస్తికి వేంటనే తరలి పోతారు, గోవిందుడు ప్రతిరోజు వెళ్ళే దారిలో ఉన్న చెట్టు నీడన కుర్చున్నారు నంబి గారు. గోవిందుడు అక్కడి శివ భక్తునిల విభుతి రేఖలతో రుద్రాక్ష మాలతో శరీరమంతా మూడు నామములతో రుద్రుడిని స్తుతిస్తూ అక్కడికి వచ్చేరు. నంబి గారు వెంటనే ఎమ్పెరుమాన్ ని స్తుతించారు, గోవింద్ పెరుమాళ్ వారిని ఆసక్తితో చూస్తూ ఉండిపోయారు. కొన్ని రోజులు తరువాత, శ్రీ తిరుమల నంబి గారు, అదే స్థలమునకు, అదే సమయములో వచ్చి శ్రీ ఆళవందారుల స్తొత్ర రత్నములోని 11 వ శ్లోకమును (ఎమ్పెరుమాన్  యొక్క స్వాభావికమైన పరతత్వము, ఇతర దేవతల పరాధీనత్వము తెలుపునది) ఒక తాటి పత్రముపై వ్రాసి అక్కడ జార విడుస్తారు. వస్తున్న దారిలో, ఆ పత్రమును కనిపించగా తీసి, చదివి మరల దానిని క్రింద పార వేస్తారు గోవింద్ పెరుమాళ్. తన తిరిగి ప్రయాణములో, ఆ పత్రమును వెతికి పట్టుకుంటారు. దాని అర్థమును నెమరు వేసుకుంటూ, నంబి గారి వద్దకు చేరి ఆ పత్రము తనదా అని అడిగిరి. ఇరువురి మధ్య సంభాషణము మొదలయి, గోవింద్ పెరుమాళ్ళకు శ్రీ మన్నారయణుని పరత్వముపై గల అన్ని సందేహములును తీర్చిరి నంబి. నంబి గారు చెప్పిన సమాధానములుకు కొంత వరకు సంతుష్టి చెంది గోవిందుడు పయనమవుతారు. తరువాత గోవిందుడు రుద్రునికి పూజ చేయుటకు పూవ్వులును కోస్తూ వున్నప్పుడు, శ్రీమన్నారాయణుని పరత్వమును చెప్పు పదిగమైన ” తిణ్ణన్ వీడు (తిరువాయ్మొళి 2.2)” ను నంబి గారు ఉపన్యాసము చేస్తారు. ఆ పదిగములోని నాలుగవ పాశురములో నమ్మాళ్వార్ స్తాపించిన అర్థమును మిక్కిలి అందముగా ప్రసంగిస్తు, పువ్వులు మరియు ప్రార్ధనలు ఎమ్పెరుమాన్ కు మాత్రమే తగును అని అనుగ్రహించారు. ఈ అర్థములను విన్న గోవిందుడు వెంటనే చెట్టు దిగి శ్రీ నంబి గారి పదములు పైన పడి, ఆర్తితో కంట నీరుతో, తాను ఇన్ని రోజులు మాయచే కప్పబడి వున్నానని తనని ఉద్దరించమని సాష్టాంగ నమస్కారము చేసారు. నంబి వారిని ఓదార్చి స్వీకరించిరి.  గోవిందుడు కళహస్తితో తనకు ఉన్న బంధుత్వమును వదులుకొని, ధనాగరము తాళము చెవులను అక్కడ వున్న రుద్ర భక్తులుకి అప్పగించారు. వారికి మునపటి రాత్రి స్వప్నమున రుద్రుడు సాక్షాత్కరించి రామానుజులు ఈ భుమిపై నిజమైన జ్ఞానమును అందరికి ఇచ్చుటకు వచ్చారు అని అందుచే గోవిందు వారి పట్ల అనుబంధమును వదిలి వేసుకుంటునప్పుడు అడ్డు చెప్ప వద్దని చెప్పారని స్వప్న వృత్తాంతమును చెప్పినారు. వారందరు సంతోషముగా గోవిందుడుని పంపిస్తారు.

తిరుమలై తిరిగి వచ్చిన తరువాత నంబి గారు గోవిందునికి ఉపనయన సంస్కారదులు, పంచసంస్కారాలు చేసి ఆళ్వారుల ప్రభందములును నేర్పిరి.

భగవత్ రామానుజులు తిరుమలకి వేంచేసి నప్పుడు శ్రీ తిరుమల నంబి గారు స్వాగతించుటకు తిరుమల కొండ స్వాగత ద్వారము కడకి వచ్చిరి. రామానుజులు “ఈ దాసుడిని స్వాగతించుటకు మీరు రావలా? ఇంక ఎవరినైన చిన్న వారిని పంపించ కూడాదా” అన్న రామానుజుల మాటలకు నంబి గారు ఎంతో వినమ్రతతో తాను బాగా వేతికి చూస్తే తనకంటే చిన్నవారు తన లేరు అని పలికారు. రామానుజులు శ్రీవేంకటనాథునికి మంగళాశసనము చేసి కొండ దిగారు.

ptm-ramayana-goshti
periya thirumalai nambi’s srI rAmAyaNa kAlakshEpa gOshti

శ్రీ రామానుజులు నంబి గారి దగ్గర శ్రీరామాయణమును నేర్చుటకు తిరుపతి వచ్చి అక్కడనే ఒక సంవత్సర కాలము ఉన్నారు. నంబి గారు శ్రీరామాయణమును అంతా వివరించిన తరువాత, శ్రీ రామానుజులు ని వారి దగ్గర నుంచి ఏమైన స్వీకరించమని అడిగారు. దానికి శ్రీ రామానుజులు
గోవిందుని తనతో పంపమని అడిగిరి. నంబి గారు సంతోషముగా పంపించినారు. కాని గోవిందుడు వారి ఆచార్యులుని విడిచి వుండలేక తిరిగి నమ్బి గారి యెడకి వచ్చినాడు. అప్పుడు నంబి గారు గోవిందునితో మాటలాడక ఇప్పుడు గోవిందుడు శ్రీ రామానుజులుకి చెందిన వాడని, వెళ్ళి పోవలెనని చెప్పారు. ఈ వృత్తాంతమును ఈ క్రింది వెబ్ లింకున పొందుపర్చబడినది.
http://ponnadi.blogspot.com/2013/01/embars-acharya-nishtai.html

అటు తరువాత గోవిందుడు సన్యాస ఆశ్రమును స్వీకరించి ఎంబార్ అని పేరు గాంచిరి.

నంబి వైభావము మరియు వారి వివరణములు వ్యాఖ్యానములో చాలా చోట్ల ప్రసంగించబడ్డాయి, వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాము.

  • తిరుప్పావై 14 – అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ – నంబి గారు తిరుప్పావై నందు “చెన్గల్ పొడిక్కూఱై వెణ్పల్ తవత్తవర్” అను దానికి ఈ విధముగా చెప్పినారు. గోపికలును నిదుర లేపుతున్న సమయమున కాషాయ బట్టలును ధరించి తెల్లని దన్తకాంతి కలవారై ఉన్న సన్యాసులు ఆలయమునుకు పోవుచున్న దాన్ని బట్టి అక్కడ చాలా పవిత్రమైన వాతావరణము నెల కొల్పబడిన విషయమును చెప్పినారు.
  • నాచ్చియార్ తిరుమొళి 10.8 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – పాశురం (మళైయే మళైయే) దాని తరువాత వచ్చు పాశురం అయిన (కడలే కడలే) అనునది నంబి గారికి చాల ప్రియమైనవి. ఈ పాశురమున ఆండాళ్ తాను అనుభవిస్తున్న భగవద్ విరహాన్ని మేఘము ద్వార తిరువేంకటముడైయాన్ కి తన వర్తమానమును పంపినది. ప్రతిసారి ఈ పాశుర విన్నపమున నంబి గారు తథాత్మ్యత ని చెందేవారు. ఈ కారణమున మన పుర్వాచర్యులు అందరికి ఇవి చాలా ప్రియమైనవి.
  • తిరువిరుత్తమ్ 3 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమున – ఆళ్వార్లు వారికి కలిగిన భగవద్ అనుభవము మానసిక సాక్షాత్కరముగా ఉండిపోతుందా లేకుంటే బాహ్య సాక్షాత్కరము కలిగి, అనుభవము కలుగున అని వాపోతున్న మనస్సును – తిరుమల నంబి గారు అవిష్కరించారని పిళ్ళై తిరునరైయూర్ వివరించారు.
  • తిరువాసిరియమ్ 1 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఆళ్వారులు పెరుమాళ్ యొక్క సౌందర్యమును “పచ్చని దుప్పటి పర్చిన కొండ వలే తాను పడుకుని ఉన్నాడు. “అని వర్ణించారు. వారు “తూన్గువతు”(పడుకునివున్నాడు) అనే సాధారణ పదప్రయోగమును చేయక “కణ్వళర్వతు” (శయనించివున్నాడు) అనే చక్కటి పదప్రయోగము చేసి వారి పదప్రయోగ విన్యాసము తెలియపరిచారు. ఎమ్పెరుమానర్ తో ఒకరిని పోల్చె సమయములో “బంగారపు కుండలాలును ఇచ్చిన పెట్టుకోలేని వారు” అని నంబి సంభోదిస్తారు. ఇక్కడ నంబి ఎవరు ఎంత మంచి మాటలు చెప్పిన వినని వారి గురించి చెప్తున్నారు. చాలా సుతిమెత్తని మాటలతో వారు యెత్తి చూపిన విధానము బట్టి శ్రీవైష్ణవులు ఆవలి వారిలో దోషములును తప్పక చెప్పవలిసి వస్తే ఇలా అందముగా చెప్పాలి అని నిరూపించారు.
  • తిరువాయ్మొళి 1.4.8 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమున – ఆళ్వార్లు యొక్క భగవద్ విరహమును (నాయికా భావమున) ఒక పక్షికి చెప్పుతారు (తన స్థితిని పెరుమాళ్ళకి విన్న వించమంటారు) ఇంక తన శరీరమున శక్తి మరియు అందము పోయి, ఆయన విరహమున తాను సుష్కించి పోయాను అని చెప్పమనిరి. అందుచేత ఆళ్వార్లు ఆ పక్షి యొక్క ఆహార విషయము తననె వెత్తుకోవలెనని, తాను ఏమీ సహాయము చేయలేక పోతున్నానని విలపించిరి. నంపిళ్ళై గారు, తిరుమలనంబి గారి జీవిత విషయమును గుర్తుతెచ్చుకుంటు, తిరుమలనంబి గారు చరమ దశ లో వారి నిత్య తిరువారాధన పెరుమళ్ అయిన వెణ్ణైక్కాడుమ్ పిళ్ళై (వెన్న కోసం నాట్యమ్ చేసే కృష్ణుడు) తో ఇంకా వారికి ఒపిక లేనందున పెరుమాళ్ని వేరు ఎవరినైన ఆరాధన చేయుట కొరుకు వెత్తుక్కోమని చెప్పినట్టు విన్న వించారు.

తిరుమల నంబి గారు ఎమ్పెరుమానర్ల గుణ గణములను కీర్తించిన విధానము
చరమోపాయ నిర్ణయం అను గ్రంథము లోను చెప్పబడినది. ఈ క్రింది లింకున పొందబర్చినది.

http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

ఈ విధముగా, తిరుమల నంబిగారి గొప్పతనమును తెలుసుకున్నాము.

యామునాచార్యులు, రామానుజులు మిక్కిలి ప్రేమ వున్న తిరుమలనంబి గారి శ్రీపాదములుకు మనం అందరమూ సాష్ఠాంగ ప్రణామములు అర్పిద్దాము.

గమనిక : వీరి తిరు నక్షత్రము 6000 పడి గురు పరంపరా ప్రభావమున మరియు తిరుముడి అడైవు అనుసరించి చైత్రమాసము స్వాతి నక్షత్రము గా పెర్కొనబడినది. కాని వాళి తిరు నామమున వైశాఖ మాసము స్వాతి నక్షత్రముగా చెప్పబడినది, ఆరోజే జరుపుకుంటున్నాము.

పెరియ తిరుమలై నంబి తనియన్:

పితా మహస్యాపి పితా మహాయ ప్రాచేతసాదేచపలప్రదాయ
శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమః స్తాత్

అడియెన్ సురేశ్ కృష్ణ రామనుజ దాస

మూలము: http://guruparamparai.koyil.org/2013/03/01/periya-thirumalai-nambi/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org