శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్ ।
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్ ॥
శ్రియఃపతి (లక్ష్మీ నాథుడు, శ్రీమన్నారాయణుడు) తో ఆరంభమై నాథమునులు, యామునాచార్యులు మధ్యముగా, స్వాచార్యులతో అంతమగు గురుపరంపరని నేను నమస్కరిస్తున్నాను.
ఈ దివ్యమైన శ్లోకమును కూరత్తాళ్వాన్ అనే ఆచార్యులు మన గురుపరంపరని ఉద్దేశించి రచన.
కూరత్తాళ్వాన్ భగవద్రామానుజుల శిష్యులు. వీరి ప్రకారము “అస్మదాచార్య” అనగా భగవద్ రామానుజులు. కాని సాధారణముగ అస్మదాచార్యులు అనగా ఈ శ్లోకమును పఠించు వారి ఆచార్య పురుషులుగా మనము భావించవలెను.
ఉపదేశ రత్నమాలై అను గ్రంథమున మణవాళ మామునులు మన సాంప్రదాయమును ‘ఎంబెరుమానార్ దర్శనము’ అని నంపెరుమాళ్ళను కీర్తించ్చినట్లు తెలియజేసారు. ప్రాచీనమైన సనాతన ధర్మమును చాలా తేలికైన భాషలో జనులందరికి అందించి మరలా ధర్మ సంస్ధాపన చేసిన గురువులు మన ఎంబెరుమానార్లు. తమ ముందు ఉన్న ఆచార్యులైన నాథమునులు, యామునాచార్యుల శ్రీ సూక్తులను తీసుకొని మన అందరికి అందించిన మహనీయులు.
ఆచార్య, గురువు అనే ఈ రెండు పదాలు పర్యాయ పదములు. గురువు అనగా అజ్ఞానమును పోగొట్టువాడు. ఆచార్య అనగా శాస్త్రమును నేర్చుకొని, అది ఆచరణలో (అనుష్టానములో) పెట్టి, అందరూ ఆచరించే విధముగ చేయువాడు. గురుపరంపర అనగా మొదట ఒకరితో ఉపదేశమును పొంది, ఆ పొందినవారు తమ శిష్యులకు ఆ జ్ఞానాన్ని ఉపదేశించి, అలా క్రమం తప్పకుండ ఒక పరంపరాగతంగ ఆగ కుండా జ్ఞాన బోధ చేసే పరంపరను గురు పరంపర అని అందురు. పైన చెప్పిన ‘లక్ష్మీనాథ సమారంభామ్’ శ్లోకము నుండి మన శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రథమాచార్యులుగా శ్రీమన్నారాయణుడే ఉండి జీవుల అజ్ఞానమును పోగొట్టి వారికి నిరంతరము బ్రహ్మానంద అనుభూతిని కలగ చేసి చివరికి శ్రీ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించుచున్నారు. ఇందువలన మనకు మొట్ట మొదటి ఆచార్యులు ఆ శ్రీమన్నారాయణుడే.
తత్త్వ జ్ఞానం మోక్ష లాభః అని శాస్త్రము చెప్పుచున్నది. అనగా “తత్త్వ జ్ఞానమును పొందిన; మోక్షమును పొందును”.
ఇప్పుడు మనము పొందుతున్న జ్ఞానము ఈ విధమైన పరంపరాగతంగ ఆచార్య పురుషుల చేత పొందినదే.
అందువలన ఆచార్యుల గురించి తెలుసు కొనుట ఎంతో అవసరము. వారి జీవితము, వారి జీవన విధానము, వారి శ్రీ సూక్తులు తెలుసుకొనుట వలన మనకు భగవంతుని మీద ప్రేమ కలిగి మన స్వరూపమును పొందగలము.
రామానుజ తిరువడిగళే శరణమ్
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
2 thoughts on “శ్రీవైష్ణవ గురు పరంపర పరిచయం – 1”