అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ – తిరుప్పాడగమ్ 

తిరునక్షత్రము: కార్తీక మాసము, భరణీ

అవతార స్థలము: వింజిమూర్

ఆచార్యులు: ఎమ్పెరుమానార్

శిష్యులు: అనన్తాళ్వాన్, ఎచ్చాన్, తొణ్డనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు

గ్రంథములు: ఙ్ఞాన సారము, ప్రమేయ సారము.

వింజిమూర్ (ఆంధ్ర ప్రదేశ్) అను గ్రామములో జన్మించిరి. వీరు అద్వైతిగా ఉన్న సమయమున యఙ్ఞమూర్తి అను నామముతో ప్రసిద్దులు. వీరు ఒకసారి గంగా స్నానము చేయుటకు వెళ్ళి అక్కడ ఎందరో విద్వాంసులపై విజయమును సాధించి మాయావాద సన్యాసిగా మారిరి. వీరికి శాస్త్రముపైన అపారమైన ఙ్ఞానము ఉండడముచే  గొప్ప పేరును మరియు ఎంతో మంది శిష్యులను సంపాదించిరి. ఎమ్పెరుమానార్ యొక్క కీర్తిని గురించి విన్నవారై వారితో వాదము చేయవలెనని కోరిక కలిగెను. వారు చాలా గ్రంథములను లిఖించి తమ శిష్యులతో  శ్రీరంగమునకు ఎమ్పెరుమానార్ (భగవద్రామానుజులు) ను కలుసుకోవటానికై బయలు దేరిరి.

ఎమ్పెరుమానార్ యఙ్ఞమూర్తిని ఆహ్వానించి, వారితో 18 రోజులు వాదము చేయుటకు ఏర్పాట్లు చేసుకొనిరి. వాదములో ఓడిపోతే యఙ్ఞ మూర్తి తన యొక్క పేరును ఎమ్పెరుమానార్గా మార్చు కొందునని, ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను శిరస్సుపై ధరించి వారికి శిష్యులుగా మారుతానని ప్రతిఙ్ఞ చేసిరి. ఎమ్పెరుమానార్ కూడా అతడు గెలిచినట్లైతే తానిక గ్రంథములను ముట్టనని చెప్పిరి.

వాదము మొదలై 16 దినములు గడిచినది. ఇద్దరూ కూడ వాదములో అనర్గళముగా మరియు ఆగ్రహముగా రెండు ఏనుగులు ఏ విధముగా అయితే కలహపడునో ఆ విధముగా వాదమును చేయుచుండిరి. 17 వ రోజున యఙ్ఞమూర్తి కాస్త పైచేయి సాధించిరి. అప్పుడు ఎమ్పెరుమానార్ కాస్త కలతచెంది తమ మఠమునకు వెళ్ళిరి. రాత్రి, వారు పేరరుళాళన్ అను (వారి తిరువారాధన పెరుమాళ్) ధ్యానమును చేసి వారిని ప్రార్థించి ‘ఒకవేళ తాను వాదమున౦ ఓడిపోతే అది నమ్మాళ్వార్ మరియు ఆళవందార్లచే పెంచబడిన సంప్రాదాయము దెబ్బ తినునని, అటువంటి దురదృష్టమునకు తానే కారణము కాకూడదని అని చింతించసాగిరి’. పేరరుళాళన్ ఎమ్పెరుమానార్ యొక్క కలలో కనిపించి చింతించవసరము లేదని, ఇది వారికి సరిసమానమైన ఙ్ఞానమును కలిగిన శిష్యుడిని అనుగ్రహించే ఒక దైవలీల అని చెప్పెను. ఎమ్పెరుమానార్లని ఆళవందార్ యొక్క మాయావాదముచే ఖండించి యఙ్ఞ మూర్తిని వాదములో ఓడించమని చెప్పిరి. ఎమ్పెరుమానార్, ఎమ్పెరుమాన్ (భగవానుని) యొక్క గొప్పదనమును గ్రహించిరి.  తెళ్ళవార్లు ఎమ్పెరుమాన్ యొక్క తిరునామములను అనిసంధిస్తు గడిపిరి. నిత్య అనుష్టానములను మరియు తిరువారాధనను పూర్తిచేసుకొని చివరి రోజైన (18వ) వాదమునకు గంభీరముగా వచ్చెను. యఙ్ఞమూర్తి వివేకమును కలిగి ఉండడముచే వెంటనే ఎమ్పెరుమానార్ యొక్క తేజమును చూసి వారి యొక్క శ్రీ చరణములను ఆశ్రయించి, ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను తమ శిరస్సుపై ఉంచుకొని తమ అపజయమును అంగీకరించెను. ఎమ్పెరుమానార్ తదుపరి వాదమును చేద్దామా అని అడుగగా యఙ్ఞమూర్తి ఈ విధముగా అనెను  “తనకు ఎమ్పెరుమానార్ మరియు పెరియ పెరుమాళ్ వేరుకాదని, ఇక వాదము అవసరము లేదని చెప్పిరి”. కాని ఎమ్పెరుమానార్ తమ  కృపచే సరియగు ప్రమాణాములచే ఎమ్పెరుమాన్ యొక్క సత్వగుణత్వములను చూపెను. యఙ్ఞమూర్తి తనకు సన్యాసాశ్రమమును అనుగ్రహించ వలసినదిగా ఎమ్పెరుమానార్లను వేడుకొనిరి. ఎమ్పెరుమానార్ వారిని యఙ్ఞోపవీతమును (మాయవాద సన్యాసిగా ఉండడముచే) తీసి వేసి పిమ్మట ప్రాయచిత్తమును చేయవలెని ఆఙ్ఞాపించిరి. అటుపిమ్మట, ఎమ్పెరుమానార్ వారికి త్రిదండ కాషాయములను ఇచ్చి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ అను దాస్య  నామమును అనుగ్రహించిరి. కారణము పేరరుళాళన్ (తమ తిరువారాధన పెరుమాళ్) చేసిన సహాయమునకు గుర్తుగా యఙ్ఞ మూర్తి కోరిన విధముగా ఎమ్పెరుమానార్ అను తమ నామము ఉండవలెనని. అదే విధముగా ఎమ్పెరుమానార్ అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుని నమ్పెరుమాళ్ మరియు తమ తిరువారాధన పెరుమాళ్ దగ్గరికి తీసుకువెళ్ళి ‘మన కలయిక  వారు ఆడిన దైవలీల’ అని చెప్పెను.

ఎమ్పెరుమానార్ స్వయముగా అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుకి అరుళిచెయల్ మరియు వాటి  అర్థములను అనుగ్రహించిరి. అప్పుడు శ్రీరంగమునకు అనన్తాళ్వాన్, ఎచ్చాన్ మొదలగు వారు ఎమ్పెరుమానార్ యొక్క శిష్యులవుదామని వచ్చిరి.  ఎమ్పెరుమానార్, అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ వద్ద పంచ సంస్కారములను పొంద వలసినదిగా వారిని ఆదేశించిరి. అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ వారి శిష్యులకు సదా ఎమ్పెరుమానారే ఉపాయము అని  ఆదేశించిరి.

అలానే అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుకు విశేషమైన కైంకర్యమగు తమ తిరువారాధన పెరుమాళ్ అయిన పేరరుళాళన్ ఎమ్పెరుమానుకి  తిరువారాధనమును సమర్పించవలెనని చెప్పిరి.

ఒకసారి శ్రీరంగమునకు వచ్చిన ఇద్దరు శ్రీవైష్ణవులు  “ఎమ్పెరుమానార్ యొక్క మఠము ఎక్కడ?” అని అడిగెను. ఆ సమయములో  స్థానికుడు “ఏ ఎమ్పెరుమానార్?” అని అడిగెను. ఆ శ్రీవైష్ణవులు “మన సాంప్రదాయములో ఇద్దరు ఎమ్పెరుమానారులు ఉన్నారా?” అని అడుగగా అతడు ఈ విధముగా చెప్పెను, “అవును, ఎమ్పెరుమానార్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ” అనెను. అప్పుడు శ్రీవైష్ణవులు చివరికి “మేము అడిగినది ఉడయవరుల యొక్క మఠము” అనగా, అతను మఠమునకు పోవు దారిని చూపెను. ఆ సమయమున అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ అక్కడ ఉండడముచే అది విని దానికి కారణము తాను వేరొక మఠములో ఉండడము వలన ఈ విధముగా జరిగెనని కలత చెందిరి. వెంటనే వారు తమ యొక్క మఠమును నాశనము చేసి, ఎమ్పెరుమానార్ వద్దకి వచ్చి ఇంక తాను వేరొక ప్రదేశములో నివసించలేనని , జరిగిన సంఘటనను చెప్పెను. ఎమ్పెరుమానార్ అందుకు అంగీకరించి వారికి రహస్యార్థములను అనుగ్రహించెను.

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ తమిళములో ‘ఙ్ఞానసారము’ మరియు ‘ప్రమేయ సారము’ అను రెండు ప్రబంధములను అనుగ్రహించిరి. ఈ  రెండు ప్రబంధములు మన సంప్రాదాయములోని విశేష అర్ఠములను వెలికి తీయును. ముఖ్యముగా ఆచార్యుల యొక్క వైభవమును అందముగా చెప్పెను. పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణము, అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ప్రబంధములోని విశేషములను వివరించిరి. మాముణులు ఈ ప్రబంధములకు అందమైన వ్యాఖ్యానమును అనుగ్రహించిరి.

భట్టర్ చిన్నతనములో, ఆళ్వాన్ ని “శిరుమామనిశర్” (తిరువాయ్మొళి 8.10.3) యొక్క అర్థమును అడిగిరి. కారణము అది విరుద్దముగా కనబడడముచే. అందుకు, ఆళ్వాన్ ఈ విధముగా చెప్పెను ‘శ్రీవైష్ణవులైన ముదలియాండాన్, ఎంబార్ మరియు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శారీరకముగా చిన్నవారు కాని నిత్య సూరుల వలె గొప్పవారు.ఈ చరితము నంపిళ్ళై తమ  ఈడు మహా వ్యాఖ్యానములో చెప్పెను.

ఎమ్పెరుమానార్లను నిత్యము స్మరించే అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ యొక్క శ్రీచ రణములను మనం  ఆశ్రయించుదాము.

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్  తనియన్

రామానుజార్య సచ్చిష్యమ్ వేదశాస్త్రార్థ సంపదం|
చతురాశ్రమ సంపన్నం దేవరాజ మునిమ్ భజే||

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://guruparamparai.koyil.org/2012/11/28/arulala-perumal-emperumanar/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

సూచన:  ప్రమేయసారమునకు  శ్రీ మణవాళ మాముణులు అనుగ్రహించిన ద్రావిడ వ్యాఖ్యానమునకు  డా||ఉ.వే ఈ. ఏ. శింగరాచార్య స్వామి వారు తెలుగు అనువాదంతో (అరుళాళప్పెరుమాళ్ ఎంపెరుమానార్ వైభవముతో) అనుగ్రహించిన కోశము ఉన్నది. కావలసిన వారు  శ్రీరామానుజ సిద్ధాంత సభ, సికింద్రాబాద్ , నల్లా  శశిధర్ రామానుజ దాసున్ని సంప్రదించగలరు. 9885343309

5 thoughts on “అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్”

Leave a Comment